హిట్3 మ్యూజిక్ అప్డేట్!
ఈ రెండింటిలో ముందుగా హిట్3 సినిమా రిలీజవుతుంది. మే 1న హిట్: ది థర్డ్ కేస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.;
సరిపోదా శనివారం సినిమాతో మంచి హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి శైలేష్ కొలను దర్శకత్వంలో సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న హిట్3 కాగా, మరొకటి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాతగా రూపొందుతున్న ది ప్యారడైజ్.
ఈ రెండింటిలో ముందుగా హిట్3 సినిమా రిలీజవుతుంది. మే 1న హిట్: ది థర్డ్ కేస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన హిట్3 టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా మ్యూజిక్ గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. హిట్3 లో మొత్తం నాలుగు పాటలున్నాయట. అందులో ఒకటి మెలోడీ సాంగ్ కాగా ఆ పాటను ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడినట్టు తెలుస్తోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఆ సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా ఈ నెలలో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.
మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. టాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. హిట్1లో విశ్వక్ సేన్ నటించగా, హిట్2 లో అడివి శేష్ నటించాడు. ఇప్పుడు హిట్3లో నాని నటిస్తూ ఆ ఫ్రాంచైజ్ కు మరింత హైప్ పెంచాడు.