రాబిన్‌హుడ్ పోడ్ క్యాస్ట్.. వింతవింతగా..

హై బడ్జెట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం కేవలం స్టోరీ పరంగా మాత్రమే కాకుండా, వినూత్నమైన ప్రమోషన్ స్ట్రాటజీలతోను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.;

Update: 2025-03-13 06:50 GMT

నితిన్, శ్రీలీల కాంబినేషన్‌లో తెరకెక్కిన రాబిన్‌హుడ్ సినిమా మార్చి 28న గ్రాండ్‌గా విడుదల కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. ఇక మొదటి నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. హై బడ్జెట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం కేవలం స్టోరీ పరంగా మాత్రమే కాకుండా, వినూత్నమైన ప్రమోషన్ స్ట్రాటజీలతోను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.


తాజాగా, ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించి నితిన్, శ్రీలీల ఇప్పటికే టీజర్, సాంగ్స్ ద్వారా మంచి హైప్ తీసుకొచ్చారు. అయితే, సాధారణంగా హీరోలు సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చి, హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు.

కానీ రోబిన్‌హుడ్ టీమ్ మాత్రం విభిన్నమైన ప్రమోషన్ మోడల్‌ను ఎంచుకుంది. తాజాగా విడుదల చేసిన ఓ ప్రత్యేకమైన పోడ్కాస్ట్, ఇందులో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల ఇద్దరూ కలిసి ఫన్‌గా మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. హానెస్ట్ గా ఆన్సర్ చెప్పాలి అని నితిన్ దర్శకుడిని వింతవింతగా ప్రశ్నలు అడిగాడు. ఫైట్స్ చేస్తున్నప్పుడు కొంతమంది విలన్స్ అలా చూస్తుంటే ఉంటారు ఎందుకు? అలాగే మార్కెట్ లో సాంగ్ పెట్టినప్పుడు పక్కన కూరగాయలు అమ్మేవాడు కూడా స్టెప్పులు ఎందుకు వేస్తాడు అంటూ డిఫరెంట్ ప్రశ్నలు అడగడంతో వెంకీ కూడా అదే తరహాలో ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు.

ఈ పోడ్కాస్ట్ కేవలం సినిమాను ప్రమోట్ చేసేందుకే కాకుండా, నితిన్-వెంకీ కుడుముల మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీని హైలైట్ చేస్తోంది. ఇద్దరూ తమ మీదే జోక్స్ వేసుకుంటూ, సరదాగా గడిపిన సమయం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సినిమా ప్రమోషన్లు ఎలా చేయాలనే దానిపై రాబిన్‌హుడ్ టీమ్ కొత్త పంథాను ప్రవేశపెట్టింది. బీటీఎస్ వీడియోలు, పాడ్కాస్ట్ ఇలా వరుసగా వినూత్నమైన కంటెంట్ రిలీజ్ చేయడం వల్ల సినిమా బజ్ మరింత పెరిగింది.

ఇక 'అధి ధా సర్‌ప్రైసు' అనే స్పెషల్ సాంగ్ కూడా మూవీ ప్రమోషన్స్‌లో పెద్ద ప్లస్ అయింది. తాజాగా కేతికా శర్మ ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసి ఓ రీల్ చేయడం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇలాంటి క్రియేటివ్ ప్రమోషన్లతో రాబిన్‌హుడ్ టీమ్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తోంది. ముఖ్యంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా మీద అటెన్షన్ తీసుకురావడం అంత సులభం కాదు. ప్రతిరోజూ కొత్త సినిమాలు, కొత్త కంటెంట్ మార్కెట్‌లోకి వస్తున్న తరుణంలో రాబిన్‌హుడ్ టీమ్ చేసే ప్రమోషన్స్ ఎంత క్రియేటివ్‌గా ఉంటే, అంతగా ఆడియన్స్‌ను ఆకర్షించగలుగుతున్నాయి. ఇది కేవలం సినిమా కథ మీద నమ్మకమే కాకుండా, ఈ సినిమాను పెద్ద హిట్‌గా మార్చేందుకు యూనిట్ ఎంతగా కృషి చేస్తుందో కూడా చెప్పే విషయమే.

Full View
Tags:    

Similar News