టాలీవుడ్ లో కలవాల్సిన క్రేజీ కాంబోస్!
టాలీవుడ్ లో చేతులు కలపాల్సిన క్రేజీ కాంబోలు కొన్ని ఉన్నాయి. ఇంత వరకూ ఆ సన్నివేశం ఎప్పుడు చోటు చేసుకోలేదు.;
టాలీవుడ్ లో చేతులు కలపాల్సిన క్రేజీ కాంబోలు కొన్ని ఉన్నాయి. ఇంత వరకూ ఆ సన్నివేశం ఎప్పుడు చోటు చేసుకోలేదు. మునుపటిలా కాకుండా ఇప్పుడు హీరోలంతా కలిసి మెలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఒకరి చిత్రాల్లొ మరోకరు గెస్ట్ రోల్ పోషించడానికి కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు. ఛాన్స్ ఇవ్వాలే గానీ రెడీ అంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటసింహ బాలకృష్ణతో కలిసి మంచి యక్షన్ సినిమా చేయాలని ఉందని ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.
ఆ అవకాశం కూడా బోయపాటి శ్రీను కే చిరంజీవి కల్పించారు. ఇద్దరి మాస్ ఇమేజ్ కు తగ్గ స్టోరీ ఆయన మాత్రమే రాయగలడు అన్న నమ్మకంతో బోయపాటికే ఛాన్స్ దక్కింది. వీళ్లిద్దరు ఎప్పుడైనా కలిసి నటించే అవకాశం ఉంది. అలాగే చిరంజీవి-నాగార్జున కలిసి నటిస్తే చూడాలని మెగా-అక్కినేని అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వ్యక్తిగతంగా చిరంజీవి-నాగార్జునల మధ్య మంచి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే.
ఒకరంటే ఒకరు ఎంతో అభిమానించుకోవడం చూపిస్తుంటారు. అభిమానులు వాళ్ల స్నేహం చూసి వాళ్లిద్దరు ఒకే ప్రేమ్ లో కనిపిస్తే చూడాలని ఆశ పడుతున్నారు. అలాగే చిరంజీవి విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిం చాలన్నది అభిమానుల ఆశ. వెంకీ లాంటి కూల్ స్టార్ తో మెగాస్టార్ తోడైతే ఆ ప్రేమ్ మరింత అందంగా ఉంటుం దన్నది అభిమానుల ఆశ. అలాగే బాలకృష్ణ-వెంకటేష్-నాగార్జున లాంటి స్టార్లతో కూడా కలిసి నటించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వీళ్లంతా ఎంతో కాలంగా సీనియర్లు. ఒకరి సినిమాల్లో ఒకరు ఎప్పుడు నటించింది లేదు. ఇప్పటికైనా అది జరిగితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి టాలీవుడ్ పాన్ ఇండియా ట్రెండ్ నేపథ్యంలో వాళ్లంతా చేతులు కలుపుతారా? లేదా? అన్నది వాళ్ల చేతుల్లోనే ఉంది.