రష్మిక@రూ.3300 కోట్లు.. దీపికా, ఆలియా ఎక్కడ?

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న 2023లో యానిమల్‌ సినిమాతో, 2024లో పుష్ప 2 సినిమాతో, ఈ ఏడాదిలో ఛావా సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.;

Update: 2025-03-13 09:30 GMT
రష్మిక@రూ.3300 కోట్లు.. దీపికా, ఆలియా ఎక్కడ?

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న 2023లో యానిమల్‌ సినిమాతో, 2024లో పుష్ప 2 సినిమాతో, ఈ ఏడాదిలో ఛావా సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. మూడు సినిమాలకు మూడు సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్‌. ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఏ హీరోయిన్‌కి ఈ స్థాయిలో విజయాలు నమోదు కాలేదు. వరుసగా విజయాలు ఉన్న హీరోయిన్లు ఉన్నారేమో.. కానీ వరుసగా వెయ్యి కోట్లు, అంతకు మించి వసూళ్లు సాధించిన సినిమాలు ఉన్న హీరోయిన్స్ మాత్రం లేరని బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు.

యానిమల్‌ సినిమా దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాల టాక్‌. ఆ సినిమాలో రష్మిక మందన్న పోషించిన పాత్ర గీతాంజలికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. రణబీర్‌ కపూర్‌ను కొన్ని సన్నివేశాల్లో డామినేట్‌ చేసే విధంగా రష్మిక నటించింది అంటూ ప్రశంసలు అందుకుంది. అందుకే రష్మిక మందన్న కు బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఆ సినిమా ఫలితం మరవక ముందే పుష్ప 2 సినిమాతో దేశం మొత్తం తన వైపు తిరిగి చూసే విధంగా చేసింది. అల్లు అర్జున్‌కి ఏమాత్రం తగ్గకుండా పుష్ప రాజ్ భార్య శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటించి మెప్పించింది. శ్రీవల్లి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు.

పుష్ప 2 సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఇండియన్‌ సినిమాల్లో ఇప్పటి వరకు దంగల్‌ మాత్రమే ఈ స్థాయి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత పుష్ప 2 సినిమా నిలిచింది. సుదీర్ఘ కాలంగా నెం.2 స్థానంలో ఉన్న బాహుబలి 2 సినిమాను మూడో స్థానంకు పరిమితం చేసిన పుష్ప 2 సినిమాతో రష్మిక మందన్న స్థాయి మరింత పెరిగింది. ఇక పెద్దగా అంచనాలు లేకుండా ఇటీవల విడుదలైన ఛావా సినిమా సంచలన వసూళ్లను రాబడుతోంది. లాంగ్‌ రన్‌లో సినిమా వెయ్యి కోట్లకు మించి రాబడుతుంది అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఇటీవల ఛావా సినిమా తెలుగు వర్షన్ విడుదలైన విషయం తెల్సిందే.

యానిమల్‌, పుష్ప 2, ఛావా సినిమాల కలెక్షన్స్ మొత్తంగా చూసుకుంటే దాదాపు రూ.3300 కోట్లగా ఒక అంచనాను రష్మిక ఫ్యాన్స్ వేస్తున్నారు. కేవలం రెండు సంవత్సరాల గ్యాప్‌లో ఒక హీరోయిన్‌ తన సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అనేది ఆల్‌ టైమ్ రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులోనూ ఇలాంటి రికార్డ్‌ మరే హీరోయిన్‌కి దక్కక పోవచ్చు అంటున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న సల్మాన్‌ ఖాన్‌తో సికిందర్‌ సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో నటిస్తుంది. సికిందర్‌ పాజిటివ్‌ టాక్ దక్కించుకుంటే ఈజీగా రూ.500 కోట్ల వసూళ్లు నమోదు అవుతాయి. కనుక ఈ ఏడాది చివరి వరకు రష్మిక వసూళ్ల మొత్తం రూ.4000 కోట్లను చేరినా ఆశ్చర్యం లేదని ఆమె ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News