పిక్‌టాక్‌ : క్లోజప్‌ పిక్స్‌తో బ్యూటీ కిల్లింగ్‌

ఆ సినిమాలో దిశా నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. సింప్లీ సూపర్‌ అంటూ చాలా మంది ప్రశంసలు కురిపించడంతో బాలీవుడ్‌లో ఈ అమ్మడు బిజీ అయింది.;

Update: 2025-03-13 11:59 GMT

2015లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన లోఫర్‌ సినిమాతో దిశా పటాని హీరోయిన్‌గా పరిచయం అయింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకోలేక పోయింది. దాంతో దిశా పటానీ తెలుగులో ఒకటి రెండు చిన్న ఆఫర్లు వచ్చినా తిరస్కరించి బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వచ్చింది. లోఫర్‌ సినిమా నిరాశ పరచినా దిశా పటానికి బాలీవుడ్‌లో ఎంఎస్ ధోని సినిమాతో మొదటి విజయం దక్కింది. ఆ సినిమాలో దిశా నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. సింప్లీ సూపర్‌ అంటూ చాలా మంది ప్రశంసలు కురిపించడంతో బాలీవుడ్‌లో ఈ అమ్మడు బిజీ అయింది.


2016లో విడుదలైన 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాతో బాలీవుడ్‌లో ఆఫర్లు సొంతం చేసుకుంది. హిందీ సినిమాల కంటే ముందు చైనీస్ మూవీలో ఈమెకు ఛాన్స్ రావడం విశేషం. చైనీస్ మూవీలో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత అక్కడ సినిమాలు చేయలేదు. చైనీస్ మూవీ కుంగ్ ఫూ యోగా తర్వాత బాలీవుడ్‌లో ఈమె వరుసగా సినిమాలు చేసింది. ఏడాదికి ఒకటి రెండు సినిమాల చొప్పున బిజీ హీరోయిన్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు రెగ్యులర్‌గా షేర్ చేయడం ద్వారా అత్యధిక ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. ఇన్‌స్టాలో ఈమెను 61 మిలిన్‌ల మంది ఫాలో అవుతున్నారు.


బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో ముందు వరుసలో ఉండే ఈమె తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. సాధారణంగానే స్కిన్‌ షో చేసి దిశా పటానీ ఫోటోలు షేర్ చేస్తే చూపు తిప్పుకోవడం కష్టం. అలాంటిది ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందంగా కనిపించడంతో పాటు, క్లోజప్ అందంతో కవ్విస్తుంది. ఇలాంటి ఫోటోలతో ఫ్యాన్స్‌ను చంపేస్తావా ఏంటి అంటూ కొందరు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ముందు ముందు ఈమె బాలీవుడ్‌లో మోస్ట్‌ అవైటెడ్‌ మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు కమిట్‌ కాకుండా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది.


మొదటి సినిమా లోఫర్‌ తర్వాత తెలుగులో దిశా నటించలేదు. సుదీర్ఘ కాలం తర్వాత ఈమె తెలుగులో 'కల్కి2898 ఏడీ' సినిమాలో నటించింది. ప్రభాస్‌కి జోడీగా కావడంతో పాటు, పాన్‌ ఇండియా మూవీ కావడం వల్ల కల్కి సినిమాలో ఈ లోఫర్ బ్యూటీ నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దిశా పాత్ర ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగుండేది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేశారు. ఇక తమిళ్‌లో ఈమె నటించిన కంగువా సైతం గత ఏడాది విడుదల అయింది. అయితే ఆ సినిమా నిరాశ పరచడంతో దిశా తమిళ్‌లో మళ్లీ నటించేందుకు ఆసక్తి చూపడం లేదని టాక్‌ వినిపిస్తుంది.


Tags:    

Similar News