పిక్‌టాక్ : ఈమె వయసు తగ్గుతుందా ఏంటి?

తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఫ్యాన్స్‌ను మాత్రమే కాకుండా అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.;

Update: 2025-03-13 11:15 GMT

2001లో 'ఇష్టం' సినిమాతో టాలీవుడ్‌లో శ్రియా సరన్‌ అడుగు పెట్టింది. మొదటి సినిమానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లో జెండా పాతిన శ్రియా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఇష్టం సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో వెంటనే స్టార్‌ హీరో నాగార్జున సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అప్పట్లో నాగార్జున సినిమాలో నటించే అవకాశం రావడం అనేది స్టార్ హీరోయిన్‌ కావడానికి దారి వంటిది అంటారు. అలా నాగార్జున నటించిన సంతోషం సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించినప్పటికీ ఎక్కువ గుర్తింపు ఈమెకే లభించింది.


నాగార్జునతో సినిమా తర్వాత మరోసారి బాలకృష్ణతో సినిమాలో నటించింది. బాలకృష్ణ సూపర్‌ హిట్ బ్లాక్ బస్టర్ చెన్నకేశవ రెడ్డి సినిమాలో శ్రియా నటించింది. ఆ తర్వాత తరుణ్‌తో నువ్వే నువ్వే, ఉదయ్‌ కిరణ్‌ తో నీకు నేను నాకు నువ్వు, మెగాస్టార్‌ చిరంజీవితో ఠాగూర్‌ సినిమాలు చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి వరుసగా మూడు సంవత్సరాలు వరుస విజయాలను సొంతం చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అర డజను సినిమాలు వరుసగా ఈమెకు సక్సెస్‌ను తెచ్చి పెట్టడంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్‌, ఇంగ్లీష్ సినిమాలోనూ శ్రియా నటించిన విషయం తెల్సిందే.


శ్రియా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు పాతిక ఏళ్లు అవుతోంది, అంతే కాకుండా ఆమె వయసు కూడా నాలుగు పదులు దాటింది. హీరోయిన్‌గా వరుసగా ఆఫర్లు దక్కడం లేదు. దాంతో కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని తల్లిగా కూడా మారింది. పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎందుకు, సోషల్‌ మీడియా ఎందుకు అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ శ్రియా మాత్రం అలా అనుకోలేదు. వచ్చిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సోషల్‌ మీడియాలో తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఫ్యాన్స్‌ను మాత్రమే కాకుండా అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.


సింపుల్‌ బ్లూ అండ్‌ బ్లాక్ కాంబోలో ఔట్‌ ఫిట్‌ను ధరించిన శ్రియా సరన్‌ ఎప్పటిలాగే మతి పోగొట్టే విధంగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. శ్రియా అందం ముందు ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారు సైతం దిగదుడుపే అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రియా ఈ ఫోటోలను షేర్‌ చేసిన వెంటనే లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా ఈమె వయసు పెరుగుతుందా, తగ్గుతుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇష్టం సినిమాలో ఎంత క్యూట్‌గా ఉందో ఇప్పుడు కూడా అంతే క్యూట్‌గా అందంగా ఉందని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News