విజయ్ డిజాస్టర్ మూవీకి సీక్వెల్.. డైరెక్టర్ ఏమన్నారంటే
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నుంచి గతేడాది వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా వచ్చి మిక్డ్స్ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.;
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నుంచి గతేడాది వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా వచ్చి మిక్డ్స్ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. గోట్‌కు మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ గతేడాది కోలీవుడ్ లో భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు.
ఈ సీక్వెల్ కు గోట్ వర్సెస్ ఓజీ అని టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. అయితే రీసెంట్ గా వెంకట్ ప్రభు ఓ అవార్డు ఫంక్షన్ కు హాజరవగా, అక్కడ యాంకర్ గోట్ సీక్వెల్ గోట్ వర్సెస్ ఓజీ గురించి అప్డేట్ అడిగారు. దానికి వెంకట్ ప్రభు 2026 తర్వాత ది గోట్ సీక్వెల్ గురించి అప్డేట్ ఇస్తానని సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చారు.
వెంకట్ ప్రభు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వెంకట్ ప్రభు మాటల్ని బట్టి నెటిజన్లు ఎవరికి నచ్చినట్టు వారు అర్థాలు తీసుకుంటున్నారు. విజయ్ 2026 ఎలక్షన్స్ లో ఎలాగూ గెలవలేడని, అందుకే తిరిగి విజయ్ సినిమాల్లోకి వచ్చి యాక్టింగ్ చేస్తాడని, ఈ నేపథ్యంలోనే గోట్ వర్సెస్ ఓజీ 2026లో మొదలవుతుందని చెప్పారని కొందరంటుంటే, విజయ్ ఫ్యాన్స్ మాత్రం విజయ్ మళ్లీ సినిమాలు చేస్తాడా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
మరికొంత మందైతే విజయ్ గోట్ కు సీక్వెల్ ను తెరకెక్కించే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదని వెంకట్ ప్రభుకి కూడా తెలుసని, అందుకే ఆయన 2026 తర్వాత దాని గురించి అప్డేట్ ఇస్తానని వ్యంగ్యంగా చెప్పారని అంటున్నారు. ఏదేమైనా వెంకట్ ప్రభు అవార్డు ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
మరి 2026 ఎలక్షన్స్ తర్వాత విజయ్ తిరిగి సినిమాల్లోకి వస్తాడో లేక వెంకట్ ప్రభు చెప్పింది సెటైర్ గానే మిగిలిపోతుందా అనేది తెలియాలంటే ఆ టైమ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో జన నాయగన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ విజయ్ కెరీర్లో 69వ సినిమాగా రూపొందుతుంది. ప్రస్తుతానికైతే జననాయగన్ సినిమానే విజయ్ చేసే ఆఖరి మూవీ అంటున్నారు.