ఆయన్ని రాజకీయం చేసి తప్పించారా?
ఐఫా అవార్డుల ప్రదానోత్సవం ఇటీవల రాజస్థాన్ లోని జైపూర్ లో అట్టహాసంగాముగిసిన సంగతి తెలి సిందే.;
ఐఫా అవార్డుల ప్రదానోత్సవం ఇటీవల రాజస్థాన్ లోని జైపూర్ లో అట్టహాసంగాముగిసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన వివిధ విభాగాలకు సంబంధించి పురస్కారాలు అందజేసారు. అయితే గాయకుడు సోనూ నిగమ్ ఆలపించిన `మేరే డోల్ నా` పాటకు ఐఫా నామినేషన్ లో చోటు దక్కక్కపో వడంపై సోనూ నిగమ్ అసంతృప్తిని వ్యక్తం చేసారు. 2025ఐఫాకు నామినేట్ అయిన గాయకులు జాబితాను ఇన్ స్టాలో షేర్ చేసారు.
ఐఫా 2025కి నామినేట్ అయిన సింగర్స్ జాబితాని సోనూ నిగమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి `థాంక్యూ ఐఫా`. ఏది ఏమైనా చివరికి మీరు రాజస్థాన్ ప్రభుత్వానికి సమాధానం ఇవ్వాలి కదా` అని రాసుకొచ్చారు. రాజస్థాన్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ పోస్ట్ పెట్టడానికి ఓ కారణం ఉంది. గత ఏడాది డిసెంబర్ లో రాజస్థాన్ లో సోనూ నిగమ్ కాన్సర్ట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈవెంట్ మధ్యలో ఉండగానే వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇలా వెళ్లిపోవడాన్ని ఉద్దేశించి సోను నిగమ్ ఇలా స్పందించారు. ఈవెంట్ పూర్తయ్యే వరకూ ఉండలేమనుకుంటే? రాజకీయ నాయకులు కాన్సర్ట్ కు హాజరు కావొద్దని కాస్త ఘాటుగానే అన్నారు. ఇది అప్పట్లో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో అవార్డుల కార్యక్రమంలోకి రాజకీయాలు తీసుకొచ్చి సోనూ నిగమ్ కి అవార్డు రాకుండా నాయకులే అడ్డు పడి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో సోనూ నిగమ్ కి ఆయన అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. 2025 లో బెస్ట్ సింగర్ కేటగిరికి అర్జిత్ సింగ్, మిత్రజ్, బాద్ షా, జుబిన్ నౌటియల్ నామినేట్ అయ్యారు. బెస్ట్ సింగర్ ఫిమేల్ కేటగిరిలో 'మేరే డోల్ నా' పాటకే శ్రేయా ఘోషల్‌కి పుర స్కారం దక్కింది.