సినీ క్రిటిక్ పై ఫైర్ అయిన డైరెక్టర్
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.;
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తూ ఉంటారు వివేక్. ఎలాంటి సమస్యపై అయినా ఓపెన్ గా తన అభిప్రాయాన్ని వెల్లడించే వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ది దిల్లీ ఫైల్స్ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు.
అయితే వివేక్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ మూవీ క్రిటిక్ బాలీవుడ్ ను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చకు దారి తీసింది. బాలీవుడ్ లో అందరూ వరుసగా ఫ్లాప్ మూవీస్ తీస్తున్నారు. అసలు బాలీవుడ్ కు ఏమైంది? ది దిల్లీ ఫైల్స్ కూడా డిజాస్టర్ అవుతుందని ఓ సినీ విశ్లేషకుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సినీ విమర్శకుడు చేసిన ఆ పోస్ట్ పై వివేక్ అగ్నిహోత్రి అసహనం వ్యక్తం చేస్తూ దానికి బదులిచ్చారు. గత రెండేళ్లలో ఎప్పుడూ లేనన్ని బ్యాక్ టు బ్యాక్ హిట్లు బాలీవుడ్ నుంచి ఉన్నాయని, బాలీవుడ్ డౌన్ అవుతుందా ఎక్కడ అని ప్రశ్నించారు. పఠాన్, జవాన్, గదర్2, యానిమల్, స్త్రీ2, ఛావా ఈ సినిమాలన్నీ రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించాయని వివేక్ తెలిపారు.
బాలీవుడ్ కాకుండా మరేదైనా ఇండస్ట్రీలో ఇలా వరుస హిట్లు ఉన్నాయా అని ప్రశ్నించిన వివేక్, 2023 ఇండియన్ సినిమా కలెక్షన్స్ లో బాలీవుడ్ నుంచే 65% కలెక్షన్స్ నమోదయ్యాయని, అయినా క్రిటిక్ గా ఓ సినిమా డిజాస్టర్ అవాలని ఎందుకు కోరుకుంటున్నారని వివేక్ అతనిపై ఫైర్ అయ్యారు.
ఇప్పటివరకు ఎవరికీ తెలియని నిజాలను తన ది దిల్లీ ఫైల్స్ మూవీలో చూపించనున్నట్టు తెలిపిన వివేక్ అగ్నిహోత్రి, కొన్ని సంవత్సరాల నుంచి తాను ఎవరూ చెప్పలేని కథలను ప్రపంచానికి తెలియచేస్తున్నానని, ముందుగా ది తాష్కంట్ ఫైల్స్ తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న తాను ది కశ్మీర్ ఫైల్స్ తో సంచలనాలు సృష్టించానని, ఇప్పుడు ది దిల్లీ ఫైల్స్ కూడా అలానే ఉంటుందని, ఈ సినిమాను కూడా ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకం తనకుందని చెప్పారు.