కుటుంబంపై ధృక్ప‌థం మార‌డానికి కియ‌రా కార‌ణం

తాజా ఇంటర్వ్యూలో లస్ట్ స్టోరీస్ సెట్ లో ఆర్గాజ‌మ్ సీన్ షూటింగ్ తర్వాత కియారా అద్వానీని తాను క‌లిసానని సిధ్ వెల్లడించాడు.;

Update: 2025-03-13 02:30 GMT

కొన్ని ప‌రిచ‌యాలు జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి ఒక ప‌రిచ‌యం కియ‌రా వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని అంటున్నాడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా. త్వ‌ర‌లోనే అత‌డి భార్య‌ కియ‌రా పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. ఇంత‌లోనే త‌న భార్య గురించి సిద్ధార్థ్ ఎంతో లాల‌న‌గా, ప్రేమ‌గా మాట్లాడాడు. త‌న జీవితంలోకి కియ‌రా ప్ర‌వేశం త‌న ధృక్ప‌థాన్ని మార్చేసింద‌ని అన్నాడు. బ్యాచిల‌ర్ గా ఉన్న‌ప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు మ‌రింత అర్థ‌వంతంగా మారాన‌ని అన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో లస్ట్ స్టోరీస్ సెట్ లో ఆర్గాజ‌మ్ సీన్ షూటింగ్ తర్వాత కియారా అద్వానీని తాను క‌లిసానని సిధ్ వెల్లడించాడు. ఆ రోజు కరణ్ జోహార్‌ను కలవడానికి అక్క‌డికి వెళ్లాడు. షూటింగ్ సమయంలో కియారా అద్వానీని కలిశాడు. ఆ త‌ర్వాతే ఆ ఇద్దరి మ‌ధ్యా అస‌లైన క‌థ మొద‌లైంది.

కియ‌రా- సిద్ధార్థ్ జంట బాలీవుడ్ లో అన్యోన్య‌మైన జంట‌. అత‌డు త‌న భార్య‌ను అమితంగా ఆరాధిస్తాడు. కియారాను పెళ్లాడాక‌, విభిన్న విషయాలపై కొత్త దృక్పథం ఏర్ప‌డింద‌ని సిద్ధార్థ్ అన్నాడు. నేను బొంబాయిలో ఒంటరిగా ఉన్న ఇన్ని సంవత్సరాల తర్వాత తాను జీవితంలోకి ప్ర‌వేశించ‌డం చేసే పని, కుటుంబ దృక్పథంపై గొప్ప ప్రభావాన్ని చూపింది... అని సిధ్ అన్నారు.

కియ‌రా కుటుంబం కోసం ఆలోచిస్తుంది. నీతి, నైతిక‌త త‌న‌లో ఉన్నాయి. ఈ విష‌యంలో త‌న‌ను గౌర‌వించి ఆరాధిస్తాను.. అని సిద్ధార్థ్ చెప్పాడు. ఈ జంట మొద‌టి సంతానం కోసం వేచి చూస్తున్న వేళ సిద్ధార్థ్ ఇంట‌ర్వ్యూ వేగంగా వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు కియ‌రా అద్వాణీ కొన్ని భారీ ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రించింది. ఫ్రెగ్నెన్సీ కార‌ణంగా డాన్ 3 లాంటి భారీ చిత్రాన్ని కియ‌రా వ‌దులుకుంది.

Tags:    

Similar News