ఆ హీరో కూడా కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నాడా?

ఇంత వ‌ర‌కూ ర‌వి విల‌న్ పాత్ర‌లు పోషించ‌లేదు. తొలిసారి ప్ర‌తినాయ‌కుడిగా అవ‌తారం ఎత్త‌డంతో ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు.;

Update: 2025-03-13 06:03 GMT

కోలీవుడ్ స్టార్ జ‌యం ర‌వికి స‌రైన హిట్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. 'పొన్నియ‌న్ సెల్వ‌న్' తో మంచి విజ‌యం అందుకున్నా అది గ్రూప్ స‌క్సెస్ మాత్ర‌మే. ఆ త‌ర్వాత ర‌వి న‌టించిన సోలో చిత్రాలేవి స‌రిగ్గా ఆడ‌లేదు. అలాగ‌ని ఖాళీగా లేడు. చేతిలో సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం శివ‌కార్తికేయ‌న్, జ‌యం ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సుధ‌కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో 'ప‌రాశ‌క్తి' తెరకెక్కుతోంది. ఇందులో జ‌యం ర‌వి విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు.


ఇంత వ‌ర‌కూ ర‌వి విల‌న్ పాత్ర‌లు పోషించ‌లేదు. తొలిసారి ప్ర‌తినాయ‌కుడిగా అవ‌తారం ఎత్త‌డంతో ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. అలాగే 'జెన్నీ', 'త‌ని ఒరువ‌న్ 2'లోనూ న‌టిస్తున్నాడు. 'త‌ని ఒరువ‌న్ 2' భారీ అంచనాల మ‌ధ్య తెర‌కెక్కుతోంది. మొద‌టి భాగం మంచి విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఈ బ‌జ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాల రిలీజ్ అనంత‌రం జ‌యం ర‌వి త‌న‌లో కొత్త యాంగిల్ ని బ‌య‌ట పెడుతున్న‌ట్లు స‌మాచారం.

ద‌ర్శ‌కుడిగా కెప్టెన్ కుర్చి ఎక్క‌డానికి రెడీ అవుతున్నాడట‌. యోగిబాబు హీరోగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది ఔట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ స్టోరీ అని స‌మాచారం. ఈ చిత్రం ఇదే ఏడాది పట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నా డుట‌. దీంతో కోలీవుడ్ లో మ‌రో హీరో కం డైరెక్ట‌ర్ క‌న్ప‌మ్ అవుతుంది.

ఇప్ప‌టికే ధ‌నుష్ హీరోగా న‌టిస్తూనే ద‌ర్శ‌కుడిగా సినిమాలు కూడా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని సినిమాలు తానే స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో చేస్తుండ‌గా, మ‌రికొన్నింటిని ఇత‌ర హీరోల‌తో తెర‌కెక్కిస్తున్నాడు. ఈ రెండు ప‌నుల‌ను ఒకేసారి చేయ‌డం అన్న‌ది ధ‌నుష్ కే చెల్లింది. అలాగే మ‌ల‌యాళ న‌టుడు పృధ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇదే విధానంలో సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News