అఖిల్ అంత త్వరగా వస్తాడా?
అక్కినేని అఖిల్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. అఖిల్ నుంచి చివరిగా వచ్చిన సినిమా ఏజెంట్.;
అక్కినేని అఖిల్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. అఖిల్ నుంచి చివరిగా వచ్చిన సినిమా ఏజెంట్. దాని తర్వాత అఖిల్ నుంచి మరో మూవీ రావడం కాదు కదా కొత్త సినిమాను కూడా మొదలుపెట్టింది లేదు. దీంతో అఖిల్ కొత్త సినిమా ఎప్పుడు మొదలుపెడతాడా అని అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నో స్క్రిప్టులు విన్న తర్వాత అఖిల్ వినరో భాగ్యము విష్ణు కథ డైరక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రేపటి నుంచి ఆ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడనే విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం లెనిన్ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అయితే ఈ సినిమా ఇప్పుడు మొదలైతే ఎప్పటికి రిలీజవుతుందో అని భావిస్తున్న టైమ్ లో మూవీ రిలీజ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. మార్చి 14 నుంచి మొదలు కానున్న ఫస్ట్ షెడ్యూల్ ను 20 రోజుల పాటూ గ్యాప్ లేకుండా చేసి 50% షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుందట. సినిమాలోని అధిక భాగం షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లోనే జరగనుందట.
అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అఖిల్6 ను ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారట. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, స్కామ్ 1992 ఫేమ్ ప్రతీక్ గాంధీ విలన్ గా నటిస్తాడని అంటున్నారు. కోలీవుడ్ యాక్టర్ విక్రాంత్ పేరు కూడా వినిపిస్తోంది.
అఖిల్ ఇప్పటివరకు టచ్ చేయని జానర్ లో ఈ సినిమా ఉండబోతుందని, మంచి ఎమోషన్ తో కూడిన లవ్ స్టోరీగా అఖిల్6 రూపొందనుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో దసరాకు ఆల్రెడీ పలు పెద్ద సినిమాలు షెడ్యూల్ అయి ఉండటం వల్ల అఖిల్ ఆ పోటీలో నిలబడతాడా? అసలు అనుకున్న టైమ్ కు షూటింగ్ పూర్తి చేయగలరా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ దసరాకు మిస్ అయినా ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేయాలని చూస్తున్నాడట అఖిల్. అఖిల్ రెండేళ్లు పాటూ వెయిట్ చేసినందుకు ఈ సినిమా అయినా తనకు మంచి ఫలితాన్నిస్తుందోమో చూడాలి.