దర్శకుడు గీతాక్రిష్ణపై పోలీసులకు ఫిర్యాదు
యూట్యూబ్ ను స్క్రోల్ చేసుకుంటూ పోతే సీనియర్ దర్శకుడు గీతాక్రిష్ణ ఇంటర్వ్యూలు బోలెడు కనిపిస్తాయి.;
యూట్యూబ్ ను స్క్రోల్ చేసుకుంటూ పోతే సీనియర్ దర్శకుడు గీతాక్రిష్ణ ఇంటర్వ్యూలు బోలెడు కనిపిస్తాయి. ఆ వీడియోలకు పెట్టే థంబ్ నెయిల్స్ దగ్గర నుంచి.. మాట్లాడే సబ్జెక్టు అంశాలు షాకింగ్ గా కనిపిస్తాయి. సినిమా హీరోయిన్ల మీద ఆయన చేసే కామెంట్లు తరచూ సంచలనంగా మారటంతో పాటు.. పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. ‘అలా అనుకుంటున్నారు. ఇలా అనుకుంటున్నారు. అలా చెబుతారు. వాళ్ల గురించి తెలియంది ఏముంది?’ ఇలా హీరోయిన్ల పేర్లతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడే ఆయనపై తాజాగా ఫిర్యాదు నమోదైంది.
యూట్యూబ్ లోనూ.. సోషల్ మీడియాలోనూ దారుణ రీతిలో పోస్టులు పెట్టే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ విశాఖపట్నం ఆమెన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విశాఖపోలీసు కమిషనర్ శంకబ్రత బాగ్చీకి కంప్లైంట్ చేశారు. దర్శకుడు గీతాక్రిష్ణ అక్కయ్యపాలెంలో గీతాక్రిష్ణ ఫిలిం స్కూల్.. హైదరాబాద్ లోని మాదాపూర్ లో మరో ఫిలిం ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తున్నారని.. ఇటీవల పలు యూట్యూబ్ ఛానళ్లలో ఇస్తున్న ఇంటర్వ్యూలు.. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల్లో నటీనటుల గురించి తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేయటాన్ని ప్రస్తావించారు. వీటిపై తగు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.