భద్రకాళి టీజర్: విజయ్ ఆంటోనీ 190 కోట్ల స్కామ్

తమిళ సినిమా పరిశ్రమలో విజయ్ ఆంటోనీ తన ప్రత్యేకమైన కథలతో, విభిన్నమైన పాత్రలతో ప్రతీసారి ఆశ్చర్య పరిస్తూనే ఉన్నాడు.;

Update: 2025-03-13 04:45 GMT

తమిళ సినిమా పరిశ్రమలో విజయ్ ఆంటోనీ తన ప్రత్యేకమైన కథలతో, విభిన్నమైన పాత్రలతో ప్రతీసారి ఆశ్చర్య పరిస్తూనే ఉన్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. కథల ఎంపికలో ఓ కొత్తదనం కనిపించేలా చూసే ఈ హీరో తన 25వ చిత్రంగా 'భద్రకాళి' అనే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాను ఎంచుకున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది.


ఈసారి విజయ్ ఆంటోనీ పాత్ర చాలా మిస్టీరియస్ గా ఉండబోతుందనే సంకేతాలు టీజర్ ద్వారా స్పష్టంగా అందుతున్నాయి. కథ పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాలలో 190 కోట్ల భారీ స్కామ్ చుట్టూ తిరిగేలా ఉంది. అయితే ఇందులో విజయ్ ఆంటోనీ పాత్ర అసలు ఏమిటనేది ఇంకా ఒక మిస్టరీగానే ఉంది. ఒక్కోసారి ఫ్యామిలీ మెన్ లా కనిపిస్తాడు, ఇంకోసారి గ్యాంగ్ స్టర్ మాదిరిగా ఉంటాడు.

ఈ సినిమాలో విజువల్స్ సినిమాటోగ్రాఫర్ షెల్లీ కాలిస్ట్ అద్భుతంగా క్యాప్చర్ చేశారు. స్లో మోషన్ షాట్లు, నైట్ ఎఫెక్ట్స్, యాక్షన్ మూమెంట్స్ అన్నీ కూడా చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాయి. సినిమాకు విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతాన్ని అందించగా, రాజశేఖర్ కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్‌లు ఇప్పటికే హైలైట్ గా నిలిచాయి. విజయ్ ఈ సినిమాలో మరింత స్టైలిష్ గా కనిపించడం విశేషం. టీజర్ చివర్లో "ఇది కేవలం ఆరంభం మాత్రమే" అనే డైలాగ్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ సరసన తృప్తి రవీంద్ర హీరోయిన్ గా నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, మాస్టర్ కేశవ్ వంటి నటీనటులు ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా, విడుదల సమయానికి మరింత హైప్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. విజయ్ ఆంటోనీ గతంలో 'బిచ్చగాడు', 'సైతాన్', 'కోలా' వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు.

ఇప్పుడు ‘భద్రకాళి’తో ఆ మాస్, థ్రిల్లింగ్ యాక్షన్ కోణాన్ని మరింతగా ఎలివేట్ చేయబోతున్నాడు. ఇప్పటి ట్రెండ్ ప్రకారం స్కామ్, పొలిటికల్ డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్స్ ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. విజయ్ ఆంటోనీ తన సొంత నిర్మాణ సంస్థ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ ద్వారా ఈ సినిమాను నిర్మించగా, అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు టీజర్ నుంచే ఓ విభిన్నమైన ప్రెజెంటేషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. టీజర్ లో "పిల్లి కూడా ఒక రోజు పులి అవుతుంది.. అబద్దం, అహంకారం అంతం అవుతుంది" అనే డైలాగ్ సినిమా లోనూ ఇంతకంటే పెద్ద ట్విస్టులను అందించబోతోందని భావించేలా ఉంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా థియేటర్లలోకి రానుంది.

Full View
Tags:    

Similar News