అట్లీ 'AAA' కోసం బన్నీ ఏం చేస్తున్నాడు?
అట్లీ సినిమాలు సింపుల్‌గా ఉన్నా హీరో పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి, అంతే కాకుండా హీరో పాత్రలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.;
అల్లు అర్జున్ 'పుష్ప 2' తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా నిలిచాడు. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ఏకంగా రూ.1900 కోట్ల వసూళ్లు నమోదు చేయడంతో బన్నీ స్టామినా ఏంటో అందరికీ తెలిసింది. అందుకే బన్నీతో మరో వెయ్యి కోట్ల సినిమాను తీసేందుకు తమిళ స్టార్ దర్శకుడు అట్లీ రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు అట్లీ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా షారుఖ్ ఖాన్‌తో అట్లీ రూపొందించిన జవాన్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1000 కోట్లను మించి వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. అట్లీతో సినిమా కోసం అన్ని భాషల్లోని స్టార్ హీరోలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మొన్నటి వరకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో అట్లీ సినిమా అంటూ వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల అట్లీ, సల్మాన్ ఖాన్ సినిమా క్యాన్సల్ అయింది. ఆ వెంటనే అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్ అయింది. ఇటీవల పలు దఫాలుగా అల్లు అర్జున్, అట్లీలు భేటీ అయ్యి సినిమా గురించి చర్చలు జరిపారు. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ బన్నీ తదుపరి సినిమా ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఏమాత్రం అనుమానం లేకుండా అట్లీతో అని చెబుతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటికే బన్నీ, అట్లీ కాంబో మూవీని AAA అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. ఈ సినిమా కోసం బన్నీ ప్రస్తుతం కసరత్తు ప్రారంభించాడట.
అట్లీ సినిమాలు సింపుల్‌గా ఉన్నా హీరో పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి, అంతే కాకుండా హీరో పాత్రలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే AAA సినిమా కోసం అల్లు అర్జున్ చాలా ప్రత్యేకమైన మేకోవర్‌లో కనిపించడంతో పాటు, విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అట్లీ సూచనల మేరకు ఫిజికల్‌గా రెడీ కావడంతో పాటు, పాత్రకు తగ్గట్లుగా హోం వర్క్ చేస్తున్నాడని, కొన్ని రిఫరెన్స్‌లను సైతం బన్నీ ఆన్‌లైన్ ద్వారా చూసి నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని అల్లు కాంపౌండ్ నుంచి సమాచారం అందుతోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ ఏ క్షణంలో అయినా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన అల్లు అర్జున్‌తో అట్లీ సినిమాను వెంటనే మొదలు పెట్టి ఏడాదిలోపే షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని లేదంటే వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని అట్లీ భావిస్తున్నాడట. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా అట్లీ కేవలం ఆరు నెలల్లో తీస్తాడనే టాక్ ఉంది. కనుక ఈ సినిమాను సైతం అంతే స్పీడ్‌గా అట్లీ పూర్తి చేస్తే కచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పండగే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. AAA సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే పుకార్లు వస్తున్నాయి. అందులో ఒక హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.