హిట్టు లేక డీలా! నటవారసురాలు ఏదీ అంత సులువు కాదు!!
వరస చిత్రాలతో అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు ఖుషికపూర్ అభిమానుల ముందుకు వచ్చింది.;
వరస చిత్రాలతో అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు ఖుషికపూర్ అభిమానుల ముందుకు వచ్చింది. ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో ఆరంగేట్రం చేసిన ఖుషికపూర్ ఆ తర్వాత `లవ్ యాపా`తో పెద్ద తెర ఆరంగేట్రం చేసింది. ఇది తమిళ చిత్రం లవ్ టుడేకి రీమేక్. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన నటించింది. తాజాగా సైఫ్ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన `నాదనియాన్` అనే రొమాంటిక్ కామెడీలో నటించింది.
ఖుషీ వరుస చిత్రాలలో నటిస్తున్నా ఫలితం శూన్యం. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మారాయి. ముఖ్యంగా ఇటీవల తెరకు పరిచయమవుతున్న బాలీవుడ్ స్టార్ల వారసులు ఎవరూ ఆడియెన్ ని మెప్పించడంలో విజయవంతం కాలేదు. ఖుషీ కపూర్ లుక్స్ పరంగా ఓకే అనిపిస్తున్నా నటన పరంగా ఆశించిన రేంజులో లేదు. `మామ్` శ్రీదేవి నటవారసత్వాన్ని నిలబెట్టాలంటే ఈ అమ్మడు ఇంకా చాలా విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందని విశ్లేషించారు.
తాజా ప్రచార వేదికపై ఖుషి తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవి నటించిన మామ్ సీక్వెల్ లో ఖుషి నటిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజనులు ఒక రేంజులో ఫైరయ్యారు. శ్రీదేవి నటవారసత్వాన్ని నిలబెట్టాలంటే అంత సులువు కాదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీదేవి సహజ నటి. ఆ స్థాయిలో వారసురాళ్లు రాణించడం అసాధ్యం అని పెదవి విరిచేస్తున్నారు.
తాజాగా `నాదనియాన్` నుంచి తిర్కిత్ ధూమ్ అంటూ సాగే పాటకు సంబంధించిన కొన్ని ఫోటో క్లిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. పాట చిత్రీకరణ సమయంలో ఖుషీకపూర్ తన వ్యక్తిగత మేకప్ టీమ్ తో సరదాగా జాలీగా గడిపేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఖుషీ స్టాఫ్ ని చూస్తుంటే, నెలకు కనీసం 3-4 లక్షలు వారి జీతభత్యాలు మెయింటెనెన్స్ కోసమే ఖర్చు చేస్తోందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.