శ‌రీరాకృతిపై కాదు న‌ట‌న‌పై దృష్టి పెట్టాలి

ఇబ్రహీం మూడు చిత్రాల కోసం ఒకేసారి సిద్ధమవుతున్నందున, అతడి ఆహారాన్ని పర్యవేక్షించేటప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి వచ్చింది.;

Update: 2025-03-13 03:30 GMT

బాలీవుడ్ లో చాలా మంది న‌ట‌వార‌సులు పూర్తిగా శ‌రీరాకృతిపైనే ఫోక‌స్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అలా కాకుండా స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌తో మెప్పించే వార‌సులు క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో నాద‌నియాన్ సినిమాతో సైఫ్ ఖాన్ కుమారుడు హిందీ తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. అత‌డి న‌ట‌న కంటే లుక్స్ గురించే ఎక్కువ‌గా జ‌నం ప‌ట్టించుకున్నారు. ముఖ్యంగా అత‌డి తీరైన శ‌రీరాకృతి యువ‌తుల గుండెల్లో గిలిగింత‌లు పెట్టింది.

దీనికోసం ఇబ్ర‌హీం చాలా చెమ‌టోడ్చాడు. తీరైన రూపం కావాలంటే జిమ్ లో నిరంత‌రం రోజూ రెండు గంట‌లు మినిమం క‌ష్ట‌ప‌డాలి. చాలా ర‌కాల ఆహారాల్ని త్యాగం చేయాలి. అయితే తాను మాత్రం తనకు ఇష్టమైన బిర్యానీని త్యాగం చేయకుండా ఈ రూపాన్ని సాధించాన‌ని చెప్పాడు.

సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తొలి చిత్రం 'నదానియన్' ఈవారం ప్రారంభంలో విడుదలైంది. ఖుషీ కపూర్ ఇందులో క‌థానాయిక‌. ఖాన్ తన అందమైన టోన్డ్ శరీరాన్ని ప్రదర్శించడం ముఖ్యంగా హెడ్ లైన్స్ లోకొచ్చింది. ఇటీవల క్రీడా పోషకాహార నిపుణుడు , ఇంటిగ్రేటివ్ హెల్త్ కోచ్ నికోల్ లిన్హారెస్ కేడియా ఇబ్ర‌హీం అలీఖాన్ త‌న‌ ఆకర్షణీయమైన శరీరాన్ని నిర్మించడం కోసం ఏం చేసాడో వివ‌రించారు.

మీడియాతో మాట్లాడుతూ.. ఇబ్రహీం అలీ ఖాన్ తన శరీరాకృతి విషయానికి వస్తే.. మొద‌ట అత‌డికి తండ్రి జీన్స్ వ‌చ్చాయి. ఇబ్రహీం మూడు చిత్రాల కోసం ఒకేసారి సిద్ధమవుతున్నందున, అతడి ఆహారాన్ని పర్యవేక్షించేటప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి వచ్చింది. కొన్ని చిత్రాలలో అతడు సంపూర్ణమైన శరీరాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. మారథాన్ రన్నర్ ఆధారంగా రూపొందిస్తున్న‌ చిత్రంలో శ‌రీర సౌష్ట‌వాన్ని ఎక్కువ ప్ర‌ద‌ర్శించాలి. ఇక ఆహారం క‌ట్టుబాట్ల విష‌యంలో ఇబ్ర‌హీం చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉన్నాడు.

ఇబ్ర‌హీం అభిరుచికి తగ్గట్టుగా మెనూ రూపొందించామ‌ని ఫిట్ నెస్ కోచ్ చెప్పారు. కోచ్ కేడియా ప్రకారం, భుర్జీ, పరాఠాలు, చుట్టలు, షవర్మాలను ఇష్టపడే ఇబ్రహీం తన ప్రోటీన్ అవసరాన్ని తీర్చడానికి చాలా రెడ్ మీట్ తింటాడు. అతడి మాక్రోలపై ఎటువంటి నియంత్రణా ఉండదు. ఇబ్ర‌హీం ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌, ఫెన్నెల్ గింజలు రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడే ఇతర తిండి ప‌దార్థాల‌ను జోడించారు. అత‌డు బిర్యానీని ఇష్టపడతాడు. కానీ దానిని బ్రౌన్ రైస్ లేదా క్వినోవాతో తినడానికి అనుమతిస్తారు. అయితే నూనె కంటెంట్‌లో పెద్ద కోత ఉంది! అని తెలిపారు.

ఇబ్రహీంకి ఖాళీ కడుపుతో శిక్షణ ఇచ్చే సందర్భాలు ఉన్నాయని, అతడి చురుకైన దినచర్యలను పరిగణనలోకి తీసుకుని ప్రీ వర్కౌట్‌ను జోడించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. వ్యాయామం చేసే ముందు విత్తనాలతో అరటిపండు తినడం, శిక్షణ సమయంలో ఎలక్ట్రోలైట్‌లతో నీటిని తాగుతాడు. వ్యాయామం పూర్తయిన 90 నిమిషాల్లోనే అతడికి ప్రోటీన్ కూడా అందుతుంది. షానా గౌతమ్ దర్శకత్వం వహించిన నాదానియన్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇబ్ర‌హీం కేవ‌లం శ‌రీరాకృతిపైనే కాదు న‌ట‌న‌పైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

Tags:    

Similar News