9 నెలల టార్గెట్ తో స్పిరిట్..?
9 నెలల్లోనే సినిమా షూట్ మొత్తం పూర్తి చేసి నెల రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నాడట సందీప్ వంగ.;
ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ వస్తుంది. ప్రస్తుతం రాజా సాబ్ ని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్ దానితో పాటు ఫౌజీ సినిమా కూడా చేస్తున్నాడు. ఇక త్వరలో సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. అందరి సినిమాల్లో హీరోలు ఒకలా ఉంటే సందీప్ వంగ సినిమాల్లో మరోలా ఉంటారు. యాటిట్యూడ్ కా బాప్ అనిపించేలా ఉండే అతని హీరోల క్యారెక్టరైజేషన్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి.
బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ నెక్స్ట్ స్పిరిట్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఐతే స్పిరిట్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలో సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాను సందీప్ వంగ చాలా తక్కువ టైం లో పూర్తి చేయాలని అనుకుంటున్నాడట.
ప్రభాస్ సందీప్ వంగ స్పిరిట్ ని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. 9 నెలల్లోనే సినిమా షూట్ మొత్తం పూర్తి చేసి నెల రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నాడట సందీప్ వంగ. ఐతే ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీ షెడ్యూల్ కి వరుస సినిమాలు ఉన్నాయి. రాజా సాబ్ పూర్తైనా ఫౌజీ కి డేట్స్ ఇవ్వాల్సి ఉంది. సందీప్ వంగ మాత్రం 9 నెలలు తాను అడిగినప్పుడు డేట్స్ ఇస్తే సినిమా పూర్తి చేసి ఇస్తా అంటున్నాడట.
సందీప్ వంగ ప్రభాస్ ఈ కాంబో ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి. తప్పకుండా ఈ కాంబో సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేలా చేస్తున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి కాగా త్వరలో యాక్షన్ లోకి దిగబోతున్నారని తెలుస్తుంది. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ మాత్రమే కాదు ప్రభాస్ పూర్తి చేయాల్సిన సినిమాల్లో సలార్ 2, కల్కి 2 కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ప్రశాంత్ వర్మ సినిమా ఒకటి ఓకే చేశాడని తెలుస్తుంది. ఆ సినిమా కూడా మైథాలజీ టచ్ తో వస్తుందని టాక్.