సర్ ప్రైజ్ డోస్ పెంచిన కేతిక.. మరింత హీటెక్కించేలా..

తాజాగా, ఈ హీట్ ఇంకా తగ్గకముందే కేతికా మరో ఇంటెన్స్ రీల్స్ వీడియో షేర్ చేసింది. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో, సాంగ్ ప్రాక్టీస్ సెషన్ వీడియోను షేర్ చేయడంతో అది హీటెక్కించింది.;

Update: 2025-03-12 18:36 GMT

యంగ్ హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రాబోయే మాస్ ఎంటర్‌టైనర్ 'రాబిన్‌హుడ్' భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చి, పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తుండగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సినిమాను మార్చి 24న రిలీజ్ చేయనున్నారు.

 

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి, మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ నితిన్‌కు మరో హిట్ అందిస్తుందని టాలీవుడ్ వర్గాల్లో మంచి బజ్ నడుస్తోంది. సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ స్టెప్ అప్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ, ఆడియెన్స్‌ని కట్టిపడేస్తున్నారు. తాజాగా విడుదలైన స్పెషల్ సాంగ్ "ఆధి ధా సర్ ప్రైజు" మాస్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకునేలా రూపొందించబడింది.

మోడ్రన్ గ్లామరస్ బ్యూటీ కేతికా శర్మ స్పెషల్ సాంగ్ చేస్తుండటం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. "ఆధి ధా సర్ ప్రైజు" పాటలో కేతికా గ్లామర్ డోస్ పెంచుతూ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేస్తోంది. లిరిక్స్, బీట్స్‌కి తగ్గట్టుగా ఆమె మూమెంట్స్ డాన్సింగ్ ఫీలింగ్‌ను రెట్టింపు చేస్తున్నాయి. ఈ పాటలో కేతికా స్టైలింగ్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ మాస్ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యేలా డిజైన్ చేయబడ్డాయి. పాట విడుదలైనప్పటి నుంచి కేతికా హాట్ టాపిక్ అవుతోంది.

అయితే, ఈ పాటలో కొన్ని స్టెప్పులపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది. మ్యూజిక్ కంపోజిషన్ విషయంలో పెద్దగా రిమాక్స్ రాలేదు. అయితే పాటలోని హుక్ స్టెప్ హైలైట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నా, కాంట్రవర్సీకి దారి తీస్తోంది. ఈ వివాదంతో పాటు నెటిజన్ల డిబేట్ వల్ల "ఆధి ధా సర్ ప్రైజు" పాట మరింత వైరల్ అవుతోంది.

తాజాగా, ఈ హీట్ ఇంకా తగ్గకముందే కేతికా మరో ఇంటెన్స్ రీల్స్ వీడియో షేర్ చేసింది. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో, సాంగ్ ప్రాక్టీస్ సెషన్ వీడియోను షేర్ చేయడంతో అది హీటెక్కించింది. క్లాసీ లుక్, హాట్ ఎక్స్‌ప్రెషన్స్, హై ఎనర్జీ మూమెంట్స్‌కి మాస్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైకులతో షేర్లతో కేతికా డాన్స్ వీడియో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో, ప్రొమోషన్‌లో కేతికా ఊహించని స్థాయిలో హైలైట్ అవుతోంది. మరి ఈ పాట బిగ్ స్క్రీన్ మీద ఎంత వరకూ క్లిక్కవుతుందో చూడాలి.

Tags:    

Similar News