28 కోట్లకు సీనియర్ బ్యూటీ ప్రీమియం ప్రాపర్టీ!
తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా ముంబైలోని గోరేగావ్‌లో ప్రీమియం రిటైల్ ప్రాపర్టీని కొనుగోలు చేసింది.;
సెలబ్రిటీల ఆదాయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫాంలో ఉన్నంత కాలం రెండు చేతులా సంపాదన. వచ్చిన ఆదాయంతో వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. తద్వారా భారీ మొత్తంలో లాభాలు ఆర్జిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది తారలు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా ముంబైలోని గోరేగావ్‌లో ప్రీమియం రిటైల్ ప్రాపర్టీని కొనుగోలు చేసింది.
రూ. 28.78 కోట్లు విలువగల ప్రాపర్టీని కొనుగోలు చేసింది. భారత్ రియాల్టీ వెంచర్స్ కి చెందిన 4,365 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్పేస్ లో మొత్తం ఐదు కార్ల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం కూడా ఉంది. 2023 లో కాజోల్ ముంబైలో 7.64 కోట్లతో ఓ ఆఫీసు స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది. 194.67 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెరా కార్పెట్ ఏరియాలో విస్తరించింది ఈ ఆఫీస్ స్పేస్.
అలాగే అంధేరీ వెస్ట్‌లోని వీర దేశాయ్ రోడ్డు ని అనుకుని ఓ సిగ్నేచర్ బిల్డింగ్ కూడా కొనుగోలు చేసింది. అదే ఏడాది భారత్ రియల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 16.50 కోట్లతో మరో అపార్ట్‌మెంట్ కూడా కొనుగోలు చేసింది. ఇలా కొంత కాలంగా కాజోల్ సంపాదనంతా రియల్ రంగంలోనే పెట్టుబడులుగా పెడుతుంది. కొనుగోలు చేసిన నెలల వ్యవధిలోనే వాటి ధర రెట్టింపు అవుతుంది.
బాలీవుడ్ తారలు కొంత కాలంగా కమర్షియల్ ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌తో పోల్చితే వార్షిక అద్దె రాబడి ఎక్కువగా ఉన్నందున బాలీవుడ్ తారలు కమర్శియల్ ప్రాపర్టీస్ క్రయ, విక్రయాలు జరపడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ తారలకు బాంద్రా, ఖార్, అంధేరిలోని లోఖండ్‌వాలా , వర్లీ వంటి ప్రాంతాల్లో ఉన్న అనేక భవనాలు, విల్లాలు ఉన్న సంగతి తెలిసిందే.