ప్రభాస్.. ఇది నెవ్వర్ బిఫోర్ ఛాలెంజ్
ఇందులో ప్రభాస్ రెండు వేరియేషన్లు కలిగిన పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.;
ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తరువాత అతను వరుస ప్రాజెక్టులను అంగీకరించినా, సక్సెస్ మాత్రం ఆ రేంజ్ లో కనిపించలేదు. అయినా సరే, ఆయన పాన్ ఇండియా స్టార్‌గా తన స్థాయిని కొనసాగిస్తూనే ఉన్నాడు. అభిమానులంతా డార్లింగ్ నుంచి రెగ్యులర్‌గా సినిమాలను ఆశిస్తూనే ఉన్నారు. కానీ గత రెండు సంవత్సరాలుగా ప్రభాస్ సినిమాల మధ్య భారీ గ్యాప్ తీసుకోవడం, ఫిలిం నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.
అయితే, 2025 మాత్రం ఆయన కెరీర్‌లోనే అత్యంత బిజీగా ఉండబోయే ఏడాదిగా నిలుస్తుందని తాజా సమాచారం. ఇప్పటికే ప్రభాస్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే, వీటిలో రాజా సాబ్ ముందుగానే వస్తున్నా ఆ తరువాత మాత్రం ఏ సినిమా ముందు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే చర్చ జరుగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా కోసం ప్రభాస్ భారీగా డేట్స్ కేటాయించాడు.
1940ల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమా, ఆయన కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన పీరియాడికల్ డ్రామాగా నిలవబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ తన ఇతర కమిట్మెంట్స్‌ను కొన్ని నెలల పాటు పక్కన పెట్టినట్లు సమాచారం. అంతేకాదు, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులలో ఒకటి. మొదట ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిస్తారనే ప్రచారం సాగినప్పటికీ, సినిమా స్కేల్ పెంచి, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు.
ఇందులో ప్రభాస్ రెండు వేరియేషన్లు కలిగిన పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కానీ ఇంకా కొన్ని పాటలు, ప్యాచ్‌వర్క్ మిగిలి ఉండటంతో, ప్రభాస్ దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక, ప్రభాస్ పూర్తిగా స్పిరిట్ షూటింగ్‌పై దృష్టి పెడతాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే మిగిలిన సినిమాల కంటే పూర్తి భిన్నంగా ఉండబోతోంది.
సందీప్ రెడ్డి వంగా తన చిత్రాల్లో హీరో పాత్రను విభిన్నంగా మలిచే విధంగా కథను డిజైన్ చేస్తాడు. అదే విధంగా, ప్రభాస్ ఈ సినిమాలో చాలా ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడని సమాచారం. 2025 జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట. ఇంతకుముందు ప్రభాస్ ఒకే సమయంలో ఒకటి లేదా రెండు సినిమాలు చేయడం కామన్. కానీ ఈసారి, మూడు ప్రాజెక్టులను ఒకేసారి బ్యాలెన్స్ చేయడం నిజంగా భారీ ఛాలెంజ్.
ఆయా సినిమాల కథా నేపథ్యం వేరుగా ఉండటంతో, నటన పరంగా ప్రభాస్ పూర్తిగా సరికొత్త మార్పులతో ముందుకు వెళ్లాలి. ఏ సినిమా ఆలస్యం జరిగినా, 2026 క్యాలెండర్ మారిపోతుంది. అందుకే, ప్రభాస్ ఈసారి పెద్దగా బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్‌లను పూర్తి చేయాలని చూస్తున్నాడు. మొత్తానికి, 2025 ప్రభాస్ కోసం అత్యంత క్లిష్టమైన సంవత్సరం కాబోతోంది. మూడు భారీ ప్రాజెక్టులు ఉండటంతో, అన్నీ తగిన స్థాయిలో ప్రమోట్ చేయడమూ, ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమూ అవసరమే. ప్లాన్ ప్రకారం రాజాసాబ్, ఆ తరువాత హను ప్రాజెక్టు, స్పిరిట్ వచ్చే ఛాన్స్ ఉంది.