రష్మికా మందన్నా ఆమె రికార్డునే చెరిపేస్తుందా?
రాజ్ కుమార్ రావ్-శ్రద్దా కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన `స్త్రీ 2` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.;
రాజ్ కుమార్ రావ్-శ్రద్దా కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన `స్త్రీ 2` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. `స్త్రీ`కి సీక్వెల్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనాలున్నాయి? కానీ అంతకు మించి రికార్డు వసూళ్లు సాధించి హారర్ చిత్రాల్లో ఓ బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సినిమా ఏకంగా 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
అయితే ఇప్పుడీ సినిమా వసూళ్లనే రష్మిక మందన్నా చిత్రం `థామా` టార్గెట్ చేసిందనే ప్రచారం వెలుగు లోకి వస్తుంది. ఇందులో రష్మికతో పాటు ఆయుష్మాన్ ఖురానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కూడా దినేష్ విజన్ హారర్ యూనివర్శ్ లో భాగంగా రూపొందుతుంది. ఆదిత్య సర్పోధర్ తెరకె క్కిస్తున్నారు. ఇది కూడా మైథలాజికల్ స్క్రిప్ట్. అశ్వథామ పాత్రను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నారు.
అశ్వథామ అంటే? కల్కి 2898 లో అమితాబచ్చన్ పోషించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఈ పాత్ర ఎంతో శక్తివంతమైనది. అందులో పేరుకే ప్రభాస్ హీరో తప్ప! అమితాబ్ పాత్ర సినిమాలో ఎంత బలంగా ఉంటుందన్నది తెలిసిందే. అదే పాత్రను బేస్ చేసుకుని ఈ స్క్రిప్ట్ ని సిద్దం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆ సినిమాకి ముందుగా థామ అనే టైటిల్ కంటే? `వాంపైర్స్ ఆఫ్ విజయనగర` అనే టైటిల్ ను పరిశీ లించారుట.
కానీ కథకు పురాణ ఇతిహాసంతో ముడి ఉండటంతో `థామా` గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై దర్శక, నిర్మాతలు చాలా కాన్పిడెంట్ గా కనిపిస్తున్నారు. 500 కోట్ల మార్క్ ను సునాయాసంగా చేరుకుం టుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఓపెనింగ్స్ రూపంలోనే భారీ మొత్తంలో రాబడుతుందని హిట్ టాక్ తె చ్చుకుంటే 800 కోట్లకు పైగా రాబడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.