న్యూటన్ సిద్ధాంతానికి ఆలియా అడిషన్

Update: 2016-04-21 04:48 GMT
'ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది'.. ఇది చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్న న్యూటన్ లా. ఇప్పుడిదే సిద్ధాంతాన్ని మరింతకొత్తగా చెబుతోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్. ఇలా ఆమె ఏకంగా న్యూటన్ లా నే మార్చేయడానికి చాలా పెద్ద కారణమే ఉంది.

రీసెంట్ గా ఆలియా నటించిన ఉడ్తా పంజాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. డ్రగ్ మాఫియా చుట్టూ ఈ తిరిగే కథలో బిహార్ కి చెందిన ఓ మారుమూల పల్లెటూరి పిల్లగా నటించింది ఆలియా భట్. పక్కా బిహారీగా నటించేందుకు, మాట్లాడేందుకు ఓ నెల్లాళ్లు స్పెషల్ ట్రైనింగ్ కూడా చెప్పించుకుంది అప్పట్లో. అయితే.. ఆలియా భట్ ఈ కేరక్టర్ పై ప్రశంసలు ఎన్ని వస్తున్నాయో.. విమర్శలు కూడా అలాగే వస్తున్నాయి.

ఓ వ్యక్తి అయితే బిహారీలు అలానా, ఇలానా అంటూ ఆలియాకు క్లాస్ పీకుతూ ఓ ఓపెన్ లెటర్ రాశాడు. సాధారణంగా ఇలాంటి వాటికి సైలెంట్ గా ఉండే ఆలియా.. ఈసారి మాత్రం విభిన్నంగా స్పందించింది. 'ప్రతీ యాక్షన్ కి సమానమైన వ్యతిరేకమైన రియాక్షన్ ఉంటుంది. ప్లస్ సోషల్ మీడియా ఓవరాక్షన్ కూడా' అంటూ న్యూటన్ లా కి కొత్త పాయింట్ యాడ్ చేసి.. తన రియాక్షన్ చూపించింది ఆలియా భట్.
Tags:    

Similar News