స్టార్ హీరోలందరికీ యంగ్ డైరెక్టర్లే కావాలా?
కథ నచ్చితే డైరెక్టర్ విషయంలో పెద్దగా ఆలోచన లేకుండా పట్టాలెక్కిస్తాడు. ఇలా స్టార్లు అంతా యంగ్ మేకర్స్ తో కాన్పిడెంట్ గా ముందుకెళ్తున్నారు.
స్టార్ హీరోలంతా యంగ్ డౌరెక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నారా? సీనియర్ హీరోలు సైతం వాళ్ల వైపే ఆసక్తి చూపిస్తున్నారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వరుసగా కమిట్ అవుతున్న ప్రాజెక్ట్ లన్నీ యంగ్ డైరెక్టర్లతోనే. ప్రస్తుతం 'బింబిసార' ఫేం వశిష్ట తెరకెక్కిస్తోన్న 'విశ్వంభర'లో సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా వశిష్టకిది రెండవ సినిమా మాత్రమే. తొలి సినిమా మేకింగ్ నచ్చి మెగాస్టార్ ఇంకే విషయాలు పట్టించు కోకుండా ఛాన్స్ ఇచ్చారు.
అలాగే 'దసరా' ఫేం శ్రీకాంత్ తోనూ చిరు ఓ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడితోనూ మెగాస్టార్ చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొత్త వాళ్లకే ఛాన్సులిస్తున్నారు. ప్రస్తుతం సుజిత్ తో 'ఓజీ' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా సుజిత్ కి మూడవ సినిమా ఇది.'సాహో' మేకింగ్ చూసి ఈ ఛాన్స్ ఇచ్చారు.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ యంగ్ డైరెక్టర్ల విషయంలో మరింత అలెర్ట్ గా ఉంటారు. కొత్తగా ఎవరెవరు? ఎలాంటి సక్సె లు అందుకున్నారో చూసుకుని పిలిపించి మరీ కథ లాక్ చేయించుకుంటారు. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కుర్ర డైరెక్టర్లందరితోనూ పనిచేసారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తో 'కూలీ' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అటుపై మళ్లీ నెల్సన్ దిలీప్ కుమార్ తో 'జైలర్ -2'ని పట్టాలెక్కిస్తారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొంత కాలంగా గేమ్ మార్చి వెళ్తున్నాడు.
బాలీవుడ్ లో ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న 'వార్ -2'తో పరిచయం అవుతున్నాడు. తదుపరి ప్రశాంత్ నీల్ తో సోలో ప్రాజెక్ట్ మొదులు పెట్టనున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకప్పుడు సీనియర్లకు ఎక్కువ ఛాన్సులిచ్చేవాడు. కానీ ఇప్పుడాయన ఇన్నోవేటివ్ ఐడియాలతో ఎవరోస్తే వాళ్లతోనే సినిమాలు చేస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' రిలీజ్ అనంతరం మళ్లీ 'రంగస్థలం' దర్శకుడు సుకుమార్ తో మరో సినిమా చేస్తున్నారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా కొత్త డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. అనంతరం రాహుల్ సంకృత్యన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడు దేవరకొండ. వీళ్లందరికంటే ముందే డార్లింగ్ ప్రభాస్ కొత్త వాళ్లకు అవకాలిచ్చి సక్సెస్ అయ్యారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లో మార్పుకు ఓ రకంగా డార్లింగ్ కారణం అనొచ్చు. కథ నచ్చితే డైరెక్టర్ విషయంలో పెద్దగా ఆలోచన లేకుండా పట్టాలెక్కిస్తాడు. ఇలా స్టార్లు అంతా యంగ్ మేకర్స్ తో కాన్పిడెంట్ గా ముందుకెళ్తున్నారు.