వాల్ పేపర్ లీక్.. సాహో శ్రద్ధా పెళ్లికి టైమొచ్చింది
ఈ బ్యూటీ చాలాకాలంగా డేటింగ్ లో ఉన్నా, ప్రియుడితో కలిసే షికార్ కి వెళుతున్నా కానీ అతడితో లవ్ గురించిన రహస్యాన్ని మాత్రం లీక్ చేయడం లేదు.;
కొన్నిసార్లు ఆదమరిచి మైమరిచి లేదా ఎలాంటి పట్టింపు లేకుండా కేర్ లెస్‌గా ఉంటాం. అలాంటప్పుడు నిత్యం మనల్ని వెంటాడే ఈ కెమెరా కళ్ల ప్రపంచంలో ఏదో ఒక చోట ఊహించని కోణంలో దొరికిపోవడం గ్యారెంటీ. అలాంటి పరిస్థితుల్లోనే ఇదిగో ఇలా దొరికిపోయింది సాహో శ్రద్ధ. ఈ బ్యూటీ చాలాకాలంగా డేటింగ్ లో ఉన్నా, ప్రియుడితో కలిసే షికార్ కి వెళుతున్నా కానీ అతడితో లవ్ గురించిన రహస్యాన్ని మాత్రం లీక్ చేయడం లేదు. ఇది ప్రేమా? కేవలం స్నేహం మాత్రమేనా? లేక ఇంకేదైనానా? ఏదీ చెప్పడం లేదు.
దీంతో బాలీవుడ్ మీడియా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. స్త్రీ 2 రచయిత రాహుల్ మోడీతో శ్రద్దా కపూర్ చాలా కాలంగా స్నేహంగా ఉంది. ఈ జంట రొమాంటిక్ ఫోటోలు అప్పుడప్పుడు అభిమానులకు ట్రీట్ గా మారుతున్నాయి. ఇప్పుడు లీకైన వాల్‌పేపర్ ఒకటి పెళ్లి పుకార్లకు తెర తీసింది. శ్రద్ధా కపూర్ ఫోన్ వాల్‌పేపర్‌లో రాహుల్ తనను హగ్ చేసుకుని ఉన్న ఒక అందమైన ఫోటోగ్రాప్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారుతోంది. చేతిలో పట్టుకుని ఫోన్ లో ఏదో చూస్తూ నడుచుకుంటూ వెళుతున్న శ్రద్ధాను ఒక మీడియా కెమెరా అదే పనిగా వెంటాడింది. ఆ కెమెరాలో అసలు రహస్యం రికార్డయింది. ఒకే ఒక్క క్లిక్ తో ఆ రహస్యం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తోంది.
దీని ప్రకారం.. రచయిత రాహుల్ మోడీతో శ్రద్దా కపూర్ డేటింగ్ చేస్తోందని వందశాతం ఖరారైంది. ఇందులో ఎలాంటి మిస్టరీ లేదని తన ఫోన్ వాల్ పేపర్ చాలా స్పష్ఠంగా చెబుతోంది. ఈ వాల్‌పేపర్‌ని అభిమానులు ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు. నిజానికి డేటింగ్ మ్యాటర్స్ లో ప్రైవేట్‌గా ఉండే శ్రద్ధా స్క్రీన్ రైటర్ కం అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీతో తన రొమాన్స్ మ్యాటర్‌లో చాలా స్పంగా ఉంది. ఇందులో ఎలాంటి సంకోచం లేదు. శ్రద్ధా ఏదో ఒక రోజు అతడిని పెళ్లాడుతుంది. ఈ జంట ప్రేమాయణం ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారినట్టేనని అభిమానులు సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. శ్రద్ధాకు త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉందని నెటిజన్లు నమ్ముతున్నారు! గత ఏడాది తాను ఒంటరిని కానని శ్రద్ధా ధృవీకరించింది. ప్రస్తుతం ఆ ఇద్దరి మధ్యా స్నేహం సాన్నిహిత్యం విషయంలో అభిమానులకు ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ జంట పెళ్లెప్పుడు? అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్!
శ్రద్ధా ఫోన్ వాల్ పేపర్ లీక్.. ఉద్దేశపూర్వకంగా జరిగినది అని కొందరు నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. కొందరు పెళ్లి గురించి పెద్ద ఇండికేషన్ ఇచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి శ్రద్ధా మాత్రమే సమాధానం చెప్పగలదు .. అభిమానులు ఓపికగా వేచి ఉండాలి. ఈరోజు, శ్రద్ధా కపూర్ తన 38వ పుట్టినరోజును జరుపుకోవడంతో తనకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీ 2 తర్వాత శ్రద్దా ఆచితూచి సినిమాలకు సంతకాలు చేస్తోంది.