అజిత్ కూతురు అప్పుడే హీరోయిన్ అయిపోయిందా..!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చిన్నారులంతా ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై రాణిస్తున్నారు.;
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చిన్నారులంతా ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై రాణిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో తేజ సజ్జ, సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీదివ్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ కెరీర్ లో ముందుకెళ్తున్నారు.
ఈ లిస్ట్ లో యువీనా పార్థవి కూడా ఇప్పుడు హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తోంది. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించిన యువీనా పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించింది. అమాయకపు మాటలు, అల్లరితో ఆడియన్స్ కు దగ్గరైన యువీనా మధ్యలో స్టడీస్ కోసమని సినిమాలకు దూరమైంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న యువీనా రెగ్యులర్ గా తన ఫోటోలు, అప్డేట్స్ ను అందిస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు ఎంతో ముద్దుగా కనిపించిన యువీనా ఇప్పుడు ఎంతో గ్లామరస్ గా కనిపిస్తోంది. 2013లో ఇవాన్ ఏ కమల్ సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది యువీనా.
ఆ తర్వాత మంజాభైమా ప్యాలెస్, కత్తి సినిమాల్లో నటించింది. సూర్య, అజిత్ సినిమాల్లోనూ నటించి బాలనటిగా మంచి పేరు తెచ్చుకున్న యువీనా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. వీరమ్ సినిమాలో అజిత్ తో కలిసి నటించిన ఈ చిన్నది అప్పుడే హీరోయిన్ గా మారిందేంటని అందరూ తన ఫోటోలు చూసి షాకవుతున్నారు.