ఎన్టీఆర్ కి పని ఈజీ చేసిన డ్రాగన్..!

దాని వెనుక రీజన్ ఏంటంటే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.;

Update: 2025-03-03 22:30 GMT

ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్ లో అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా డ్రాగన్. ఈ సినిమాను తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా రిలీజ్ చేశారు. సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఐతే ఈ సినిమాకు టైటిల్ తమిళ్ లో డ్రాగన్ అని మాత్రమే ఉండగా తెలుగు టైటిల్ మాత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని పెట్టారు. దాని వెనుక రీజన్ ఏంటంటే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

అందుకే తెలుగులో డ్రాగన్ కి బదులుగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని పెట్టారు. ఐతే లేటెస్ట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మైత్రి రవిశంకర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ప్రస్తావన తెచ్చారు. ఈ డ్రాగన్ ని తక్కువ అంచనా వేయడం కాదు కానీ ఆ డ్రాగన్ నెక్స్ట్ లెవెల్ లో భారీ స్థాయిలో ఉంటుందని అన్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ గా డ్రాగన్ అనేది కన్ ఫర్మ్ కాదు కానీ లేటెస్ట్ గా నిర్మాత రవి శంకర్ కామెంట్స్ తో దాన్ని కన్ ఫర్మ్ చేశారు.

సో ఎన్టీఆర్ డ్రాగన్ గా రచ్చ చేసేందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ ఈమధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఐతే సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. అందుకే నిర్మాత రవిశంకర్ ఎన్టీఆర్ డ్రాగన్ వేరే రేంజ్ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ డ్రాగన్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.

అంతేకాదు నిర్మాత రవి శంకర్ ఈ డ్రాగన్ సక్సెస్ అవ్వడం కూడా దానికి కలిసి వస్తుందని అన్నారు. సో అలా ఎన్టీఆర్ డ్రాగన్ కి ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ సపోర్ట్ చేశాడని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో కొన్నాళ్లుగా డిస్కషన్ లో ఉన్న సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా విషయంలో మేకర్స్ నో కాంప్రమైజ్ అనేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. స్ట్రైట్ బాలీవుడ్ లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాగా వార్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Tags:    

Similar News