రుక్మిణికి కండీషన్స్ పెడుతున్నారట..?
ఇప్పటికే నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసిన రుక్మిణి నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అవుతుంది.;
కన్నడ భామ రుక్మిణి అక్కడ చేసిన సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ హిట్ అందుకోగా ఆ సినిమాతో సౌత్ లో కూడా ఆమె సూపర్ పాపులారిటీ సంపాదించింది. అమ్మడు లుక్స్, యాక్టింగ్ ఇవన్నీ కూడా ఆడియన్స్ కు తెగ నచ్చేశాయి. అందుకే ఆమె వెంట దర్శక నిర్మాతలు పడుతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి ఐతే అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసిన రుక్మిణి నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అవుతుంది.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్ ని హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నటించేందుకు గాను అమ్మడికి భారీ రెమ్యునరేషనే అందిస్తున్నారని తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా విషయంలో ప్లానింగ్ మాత్రం చాలా భారీగా ఉన్నట్టు తెలుస్తుంది.
అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు గాను రుక్మిణి వసంత్ కొన్ని కండీషన్స్ కూడా పెడుతున్నారట మేకర్స్. అదేంటి అంటే ఈ సినిమా కమిటైన దగ్గర నుంచి సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా సైన్ చేయకూడదని చెప్పారట. ఐతే ఆ కండీషన్ కు రుక్మిణి కూడా ఒప్పేసుకుందని తెలుస్తుంది. కన్నడలో ఇప్పటికే ఒకటి రెండు సినిమాలతోనే రుక్మిణి సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ఎన్టీఆర్ సినిమా తో అమ్మడి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
తెలుగులో కన్నడ భామలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే రష్మిక మందన్న టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ షిఫ్ట్ అవ్వగా ఇప్పుడు రుక్మిణి కూడా తెలుగులో అదిరిపోయే ఛాన్స్ లు అందుకుంటుంది. మరి అమ్మడికి కూడా రష్మిక రేంజ్ పాపులారిటీ క్రేజ్ వస్తాయా లేదా అన్నది చూడాలి. ఎన్టీఆర్ తో సినిమా అంటే ఇక ఆ హీరోయిన్ ఫేట్ మారినట్టే లెక్క. అది కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా అంటే మాత్రం డబుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ హీరోయిజంలో ఎన్టీఆర్ రేంజ్ ఏంటన్నది తెలిసేలా చేస్తాడని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకోగా హీరోయిన్ గా రుక్మిణికి కూడా సినిమాలో మంచి పాత్ర పడితే మాత్రం అమ్మడికి కూడా పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సమైన క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.