పోకిరిలో మహేష్-ఇలియానా.. రాబిన్‌హుడ్‌లో నితిన్-శ్రీలీల: నిర్మాత రవిశంకర్!
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ కాంబోలో సినిమా అనడం ఆలస్యం దానికి ఎక్కడ లేని హైప్ వస్తుంది.;
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ కాంబోలో సినిమా అనడం ఆలస్యం దానికి ఎక్కడ లేని హైప్ వస్తుంది. అయితే ఆ కాంబినేషన్స్ హీరో-హీరోయిన్, హీరో- డైరెక్టర్, హీరో-మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఉంటుంటాయి. సినిమా బిజినెస్ మొత్తం దాదాపు ఈ కాంబినేషన్ వల్ల వచ్చే హైప్ తోనే జరుగుతుంటుంది.
అలాంటి కాంబినేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు- ఇలియానా కాంబినేషన్ ఒకటి. వీరిద్దరూ కలిసి చేసింది ఒక సినిమానే. అదే పోకిరి. కానీ ఆ సినిమాలో వారిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీకి ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి మహేష్- ఇలియానాతో ఇప్పుడు మైత్రీ నిర్మాత రవి శంకర్ మరో హీరో హీరోయిన్ ను పోల్చాడు.
కింగ్‌స్టన్ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత రవిశంకర్ రాబిన్‌హుడ్ మూవీ గురించి మాట్లాడారు. ఈ నెలాఖరున రిలీజ్ కాబోతున్న రాబిన్‌హుడ్ కు ఇకమీదట ప్రమోషన్స్ వేగం పెంచనున్నట్టు చెప్పిన ఆయన, సినిమా చాలా బాగా వచ్చిందని, రాబిన్‌హుడ్ అందరినీ అలరిస్తుందని, తాను ఆల్రెడీ సినిమా చూసినట్టు చెప్పుకొచ్చారు.
రాబిన్‌హుడ్‌లో నితిన్ ఎంతో స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నాడని, శ్రీలీల- నితిన్ కాంబినేషన్ ను చూస్తుంటే తనకు పోకిరి రోజులు గుర్తొచ్చాయని, వీళ్లిద్దర్నీ చూస్తుంటే అప్పుడెప్పుడో పోకిరిలో మహేష్ -ఇలియానా ను చూసినట్లనిపిస్తుందని, ఆ సినిమాలో గల గల పారుతున్న పాటలో మహేష్ ను చూడాలా ఇలియానాను చూడాలా అనిపించేలా వారిద్దరూ ఉంటారని, ఈ సినిమాలో నితిన్- శ్రీలీల కూడా అంతే అందంగా కనిపించారని మైత్రీ రవి అన్నారు.
వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ద్వారా వరల్డ్ క్లాస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వెండితెరకు పరిచయం అవుతుండటం తమకెంతో సంతోషాన్నిస్తుందని ఆయన తెలిపారు. కాకపోతే వార్నర్ పాత్ర సినిమాలో చిన్న పాత్రేనని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే రాబిన్‌హుడ్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.