బాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలో మాళవిక సినిమా
తమిళ నటి మాళవిక మోహనన్ ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో నటించింది లేదు. కానీ తెలుగు ఆడియన్స్ ను మాళవిక సుపరిచితురాలే.;
తమిళ నటి మాళవిక మోహనన్ ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో నటించింది లేదు. కానీ తెలుగు ఆడియన్స్ ను మాళవిక సుపరిచితురాలే. మాళవిక నటించిన ఎన్నో డబ్బింగ్ సినిమాలను తెలుగు ఆడియన్స్ ఇప్పటికే చూసేశారు. మాళవిక ఇండస్ట్రీలోకి వచ్చి ఆల్రెడీ పదేళ్లు దాటుతోంది. పదేళ్ల తర్వాత అమ్మడు ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది.
మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాలో మాళవిక లీడ్ రోల్ లో నటిస్తోంది. రాజా సాబ్ తర్వాత మాళవికకు తెలుగులో మరిన్ని ఛాన్సులు క్యూ కడతాయని అందరూ అంటున్నారు. ఇదిలా ఉంటే మాళవిక గతేడాది యుద్ర అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
సిద్దాంత్ చతుర్వేది హీరోగా రూపొందిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే మాళవిక ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందనున్న ఓ భారీ ప్రాజెక్టుకు మాళవిక సైన్ చేసినట్టు తెలుస్తోంది.
ఓ భారీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని మాళవిక సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఆల్రెడీ తమిళంలో పలు సినిమాలు చేసిన మాళవిక మోహన్ లాల్ తో కలిసి హృదయపూర్వం చేస్తోంది.
మొత్తానికి మాళవిక తెలుగు, తమిళం, మలయాళంతో పాటూ హిందీ భాషల్లో అవకాశాలు అందుకుంటూ ఆయా భాషల్లోని టాప్ స్టార్లతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసి తన సత్తా చాటుతుంది. కథల ఎంపిక విషయంలో మాళవిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫలానా వారితో కలిసి పని చేస్తానని అనుకోలేదని, తనకు వచ్చిన అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్నట్టు తెలిపింది.