ప్రశాంత్ వర్మ కూడా రాంగోపాల్ వర్మలా!
సంచలనాల రాంగోపాల్ వర్మ సినిమా ప్రకటనలు ఇవ్వడంలో ముందుటారు. కానీ వాటిని పట్టాలెక్కించడంలో ఎప్పుడూ వెనుక బడుతుంటారు;
సంచలనాల రాంగోపాల్ వర్మ సినిమా ప్రకటనలు ఇవ్వడంలో ముందుటారు. కానీ వాటిని పట్టాలెక్కించడంలో ఎప్పుడూ వెనుక బడుతుంటారు. ఆ అంశంపై సినిమా చేస్తున్నాను.. ఈ ఘటనపై స్టోరీ రాస్తున్నానని చెప్పడం వర్మకి బాగా అలవాటు. ఎక్స్ వేదికగా అలాంటి ప్రకటనల విషయంలో వర్మ నుంచి కొదవుండదు. కానీ అవి మెటీరియలైజ్ అవ్వవు. కేవలం ప్రకటనల వరకే పరిమితమవుతుంటాయి.
వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటాడు. ఈ మధ్య సినిమాలు తీసే స్టైల్ కూడా మార్చేస్తానన్నారు. తన లో పాత వర్మ ని మళ్లీ నిద్రలేపుతానన్నారు. మరి ఆ నిద్ర మత్తు నుంచి ఎప్పుడు లేస్తారు? అన్నది చూడాలి. తాజాగా వర్మనే తలపిస్తున్నాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన్ని నుంచి కూడా ఈ మధ్య కాలంలో ప్రకటనలు వస్తున్నాయి తప్ప అవి పట్టాలెక్కుతున్నాయా? అంటే అదెక్కడా కనిపించలేదు.
రిషబ్ శెట్టితో `జై హనుమాన్` ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది జరిగి కొన్నినెలలు గడుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇదే ఏడాది రిలీజ్ అవుతుందని కూడా అంతా ఆశిస్తున్నారు. కానీ ఈ సినిమా ఇంత వరకూ పట్టాలెక్కలేదు. రెగ్యులర్ షూటింగ్ మొదలైంది లేదు. రిషబ్ శెట్టి `కాంతార` ప్రీక్వెల్ షూట్లో బిజీగా ఉన్నారు. అతడి కాన్సంట్రేషన్ అంతా ప్రీక్వెల్ పై ఉంది తప్ప` జై హనుమాన్` పై కనిపించలేదు.
మరి అంత బిజీగా ఉన్న హీరోని ప్రశాంత్ వర్మ ఎందుకు తీసుకున్నట్లో? టాలీవుడ్ లో ఇంకే హీరో లేనట్లు మరీ అతడిని ఎంపిక చేసాడనే విమర్శ వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో జై హనుమాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినిమా విషయం లోనూ ప్రశాంత్ వర్మ మళ్లీ ఎలాంటి అప్డేట్ లేదు. బాలయ్య తనయుడికి నీరసంగా ఉందంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మని బాలయ్య స్కిప్ కొట్టినట్లేనన్న ప్రచారం ఇప్పటికే మొదలైపోయింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా ప్రశాంత్ వర్మ ఓసినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా ఈ ప్రాజెక్ట్ ఉందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. మరోవైపు పీసీయూ నుంచి మరిన్నిసినిమాలు చేస్తానని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఇలా ప్రకటనలు తప్ప పని కనిపించడం లేదు.