ఎల్లమ్మకు వేణు బాలీవుడ్ టచ్ ఇవ్వనున్నాడా?
వేణు ముందు ఈ స్క్రిప్ట్ పట్టుకుని నేచురల్ స్టార్ నాని దగ్గరకు వెళ్లాడు.;
బలగం సినిమా తర్వాత వేణు యెల్దండి డైరెక్టర్ గా బిజీ అయిపోయి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ వేణు మాత్రం ఎల్లమ్మ అనే స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని ఆ కథ కోసం హీరోల వేటలో పడి చాలా కాలం వృధా చేసుకున్నాడు. వేణు ముందు ఈ స్క్రిప్ట్ పట్టుకుని నేచురల్ స్టార్ నాని దగ్గరకు వెళ్లాడు.
కథ నచ్చిన నాని కొన్ని మార్పులు చేయమని చెప్పాడని, వేణు స్క్రిప్ట్ ను పలుసార్లు మార్చినప్పటికీ నానికి ఎల్లమ్మ ఫైనల్ వెర్షన్ సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఆ కథను సున్నితంగానే రిజెక్ట్ చేశాడన్నారు. దీంతో అదే కథతో వేణు శర్వానంద్ దగ్గరకు వెళ్లగా ఆయన కూడా నో చెప్పారు. తేజ సజ్జ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల వల్ల ఇప్పట్లో కుదరన్నాదన్నారు.
మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి ఆ సినిమా నితిన్ దగ్గరకు చేరింది. ప్రస్తుతం రాబిన్‌హుడ్, తమ్ముడు సినిమాలు చేస్తున్న నితిన్, త్వరలోనే ఎల్లమ్మ సెట్స్ లో జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం ఎల్లమ్మకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఎల్లమ్మ కోసం డైరెక్టర్ వేణు యెల్దండి ప్రస్తుతం ముంబైలో బాలీవుడ్ కంపోజర్స్ ద్వయం అజయ్-అతుల్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఎల్లమ్మ మ్యూజిక్ విషయంలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకోవడం ఖాయం.
మే నెల నుంచి ఎల్లమ్మ షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనుండగా, సాయి మాధవ్ బుర్రా ఎల్లమ్మకు డైలాగ్ రైటర్ గా వర్క్ చేయనున్నారు. ఎల్లమ్మకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ప్రస్తుతం నితిన్ రాబిన్‌హుడ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.