సంక్రాంతికి వస్తున్నాం.. @50 నాటౌట్.. ఎన్ని థియేటర్లలో అంటే..

సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తిచేసుకోవడం ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం. చాలా సినిమాలు డిజిటల్ హడావుడి, ఓటీటీ ప్రభావం వల్ల తక్కువ రోజులకే థియేటర్ల నుంచి వెళిపోతున్నాయి;

Update: 2025-03-04 05:55 GMT

సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తిచేసుకోవడం ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం. చాలా సినిమాలు డిజిటల్ హడావుడి, ఓటీటీ ప్రభావం వల్ల తక్కువ రోజులకే థియేటర్ల నుంచి వెళిపోతున్నాయి. కానీ, వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఈ ట్రెండ్‌ను తలకిందులు చేసింది. థియేటర్లకు మళ్ళీ పాత రోజులను గుర్తు చేసింది. కాంటెంట్ నచ్చితే జనాలు థియేటర్స్ కు వస్తారు అని ఈ సినిమా రుజువు చేసింది.

ఫైనల్ గా 50 రోజులు పూర్తి చేసుకుని 92 థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇది మామూలు రికార్డు కాదు. ఈ ఫిల్మ్ కేవలం వసూళ్ల పరంగా మాత్రమే కాదు, సుదీర్ఘ ప్రదర్శన విషయంలో కూడా హిస్టరీ క్రియేట్ చేసింది. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అంచనాలకు మించి 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, వెంకటేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఇది కేవలం వెంకటేశ్‌కి మాత్రమే కాదు, అనిల్ రావిపూడి, నిర్మాతలు, టీమ్ అంతా కలిసి అందుకున్న గొప్ప రికార్డ్. సాధారణంగా కమర్షియల్ సినిమాలు మొదటి వారం హవా కొనసాగించి, ఆ తర్వాత ఓటీటీలోకి వెళ్ళిపోతాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం మూడు, నాలుగు వారాల తర్వాత కూడా స్టడీగా రన్ అవుతూ 50 రోజుల రికార్డును చేరుకుంది.

సంక్రాంతి సీజన్ తర్వాత కూడా థియేటర్లలో నిలదొక్కుకుని లాంగ్ రన్ సాధించిందంటే, అది కుటుంబ ప్రేక్షకుల కారణంగానే. వినోదంతో పాటు మంచి కుటుంబ అనుబంధాన్ని చూపించిన కథాంశం ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ లో కూడా హవా కొనసాగిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం జీ5 లో స్ట్రీమింగ్ అవుతూనే ఓపెనింగ్ డేలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

భారీ బడ్జెట్, గ్రాండ్ మేకింగ్ తో వచ్చిన RRR, హనుమాన్ సినిమాలను దాటేసి అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించింది. థియేటర్లలో సక్సెస్ అయిన సినిమాలు ఓటీటీలో కూడా అద్భుతంగా రన్ అవుతాయని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రస్తుతం సినిమా బిజినెస్ మారిపోయింది. 50 డేస్, 100 డేస్ వంటి విజయాలను ఇప్పటి జనరేషన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఈ ఫీట్ సాధించి, ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. భవిష్యత్తులో ఈ తరహా కుటుంబ కథా చిత్రాలు మరిన్ని రావాలని, థియేటర్లలో మరిన్ని రోజులు నిలవాలని సినీ ప్రముఖులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News