ప్రభాస్ కి విలన్ గా గోపీచంద్ హీరో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో `పౌజీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో `పౌజీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా చిత్రీకరణ జరుపుతున్నారు. వీలైనంత వేగంగా `పౌజీ` పూర్తి చేసి తదుపరి సినిమాలు మొదలు పెట్టాలనే ధ్యాషతో ప్రభాస్ పని చేస్తున్నాడు. పౌజీలో డార్లింగ్ కి జోడీగా అమ్మాన్వీ నటిస్తోంది. అమ్మడు లాంచింగ్ రోజే కుర్రాళ్ల మనసు దోచేసింది.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ ని ఢీకొట్టే ప్రతి నాయకుడు ఎవరు? అన్నది ఇంత వరకూ బయటకు రాలేదు. ఆ పాత్ర గురించి పెద్దగా డిస్కషన్ కూడా సాగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆవిషయం లీకైంది. ప్రభాస్ ని ఢీకొట్టే విలన్ పాత్రకి బాలీవుడ్ నటుడు సన్ని డియోల్ ఎంపికై నట్లు వార్తలొస్తున్నాయి. `పౌజీ`లో విలన్ రోల్ అయినా ఆ రోల్ కూడా క్లాసీగానే హైలైట్ అవుతుంది. హీరో-విలన్ మధ్య బలమైన యాక్షన్ సన్నివేశాలున్నాయని అవి ఎంతో స్టైలిష్ గానూ ఉంటాయట.
ఈ నేపథ్యంలో ఆపాత్రకు సన్నిడియోల్ అయితే పర్పెక్ట్ సూటువుతుందని అతడిని ఎంపిక చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సన్ని డియోల్ సోదరుడు బాబి డియాలో సౌత్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హిందీ సినిమా `యానిమల్` తోనే బాబి డియోల్ తెలుగులో ఫేమస్ అయిపోయాడు. దీంతో తెలుగు హీరోల చిత్రాల్లో విలన్ అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం విలన్ గా అతడు చాలా బిజీగా ఉన్నాడు.
తాజాగా సన్నిడియోల్ కూడా విలన్ రోల్ లాక్ అయితే అన్నదమ్ములిద్దరు ఇండస్ట్రీలో కుమ్మేస్తారు. అయితే సన్ని డియోల్ బాలీవుడ్ లో హీరోగానూ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని సన్ని డియోల్ హీరోగా `జాట్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.