ఎప్పుడు ఏ వైపు నుంచి ఫోటో తీస్తారో తెలీదు!

ఇటీవలి ఇంటర్వ్యూలో ఆమె శరీర త‌త్వం, దాంతో పాటే వ‌చ్చిన‌ ఇమేజ్‌ని మేనేజ్ చేయాల్సిన అవ‌స‌రం గురించి మాట్లాడింది.;

Update: 2025-03-04 03:15 GMT

బాడీ ఇమేజ్‌తో తన కష్టాల గురించి ఎప్పుడూ ఓపెన్‌గా చెప్పే నటి సోనాక్షి సిన్హా. త‌న అధిక బ‌రువు గురించి ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడుతుంది. ప్ల‌స్ సైజ్ త‌న‌కు ఎప్పుడూ అడ్డంకి కాద‌ని ధైర్యంగా చెబుతుంది. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆమె శరీర త‌త్వం, దాంతో పాటే వ‌చ్చిన‌ ఇమేజ్‌ని మేనేజ్ చేయాల్సిన అవ‌స‌రం గురించి మాట్లాడింది. దీని కారణంగా పబ్లిక్ లో గోప్యత విష‌య‌మై గందరగోళం నెల‌కొంటుంద‌ని, భారతదేశంలో ఈ విష‌యంపై జాగ్ర‌త్త వ‌హించాల‌ని సోనాక్షి అంది.

అలాగే తాను భారతదేశంలో స్విమ్మింగ్‌ను ఎందుకు ఇష్టపడను? అనే విష‌యాన్ని కూడా మాట్లాడింది. ఈత దుస్తులను ధరించేటప్పుడు.. ముఖ్యంగా పెరిగే వ‌య‌సులో నేను ఎల్లప్పుడూ స్పృహతో ఉన్నాను. నేను ముంబయిలో లేదా ఈ దేశంలో ఈత కొట్టను. ఎందుకంటే ఎవరైనా రహస్యంగా ఫోటో తీసి ఎప్పుడు ఎక్క‌డికి పంపుతారో నాకు తెలియదు. ఇది ఇంటర్నెట్‌లో షికార్ చేయ‌డం నాకు ఇష్టం లేదు. నేను భార‌త‌దేశం వ‌దిలి ఎక్క‌డికైనా వెళ్లిన‌ప్పుడు ఈత కొడతాను..అని స్ప‌ష్ఠంగా చెప్పింది.

ఈ భ‌యం వెన‌క ఏదో ఒక కార‌ణం ఉంటుంది. అలాగే న‌న్ను బ‌రువు త‌గ్గాల‌ని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేద‌ని, కానీ దానికి విరుద్ధంగా చేయ‌డానికి ఇష్ట‌ప‌డేదానిని అని కూడా సోనాక్షి త‌న మొండిత‌నం గురించి చెప్పింది. చిన్న పిల్ల‌లుగా మ‌న‌స్త‌త్వాలు అలా ఉంటాయి. కానీ మా అమ్మ నాకు చెప్పడం మానేసిన రోజునే నా బరువు గురించి నేను ఏదైనా చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపించిందని తెలిపింది. బాడీ షేమింగ్, బాడీ ఇమేజ్ సమస్యలు, ట్రోలింగ్ వంటివి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల దాని గురించి బహిరంగ సంభాషణలు అవసరమ‌ని కూడా సోనాక్షి వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News