పారితోషికంలో హీరోల్నే మించిపోతున్నారా?
పాన్ ఇండియాలో వీళ్లు సాధించిన సక్సెస్ లే అంతటి ఘన కీర్తిని తెచ్చి పెట్టింది అన్నది కాదనలేని వాస్తవం.;
ఇండియాలో మోస్ట్ వాంటెండ్ డైరెక్టర్లు ఎవరు? అంటే రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, అట్లీ, నాగ్అశ్విన్ లాంటి కొంత మంది మేకర్స్ కనిపిస్తారు. వీళ్లంతా 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రాలు తీసిన దర్శకులు కావడంతోనే మార్కెట్ లో అంతగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు వీళ్లంతా స్టార్ హీరోల కన్నా ఫేమస్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పాన్ ఇండియాలో వీళ్లు సాధించిన సక్సెస్ లే అంతటి ఘన కీర్తిని తెచ్చి పెట్టింది అన్నది కాదనలేని వాస్తవం.
నేడు దేశంలో అన్ని భాషలకు చెందిన హీరోలు వీళ్లతో సినిమాలు చేయాలని క్యూలో ఉన్నారు. పిలవాలే గానీ పరిగెత్తికొచ్చి సినిమా చేయాలని చూస్తున్నారు. అయితే వీళ్లు పారితోషికాలు ఎలా తీసుకుంటారు? అన్న దానిపై సరైన క్లారిటీ లేదు. రాజమౌళి, సుకుమార్ అయితే లాభాల్లో వాటాలు తీసుకుంటారు. మిగతా వాళ్లు కూడా అదే రూట్ లో ఉండే అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే? దర్శకులు హీరోల్ని మించిన పారితోషికాలు అందుకుంటున్నట్లే.
తాజాగా అట్లీ పారితోషికం గురించి ఓ విషయం నెట్టింట వైరల్ అవుతుంది. అట్లీ తదుపరి బన్నీతో చేసే సినిమా కోసం సన్ పిక్చర్స్ నుంచి 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. పారితో షికం పరంగా చూస్తే 100 కోట్లు తీసుకున్న డైరెక్టర్ పేరు ఎక్కడా తెరపైకి రాలేదు. రాజమౌళి, సుకుమార్ లాంటి వారు లాభాల్లో వాటా తీసుకున్నారు. కానీ ఆ ఫిగర్ ఎంత అన్నది ప్రత్యేకంగా బయటకు రాలేదు.
కానీ అట్లీ పేరు మాత్రం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. సినిమా హిట్ ఫట్ తో సంబంధం లేకుండా ఇంత మొత్తంలో అట్లీ ఛార్జ్ చేస్తున్నాడని అంటున్నారు. సన్ పిక్చర్స్ లో అట్లీ షేర్ అడిగినా ఇచ్చే అవకాశం ఉండదు. బన్నీ కూడా సినిమాలో షేర్ అడగడంతోనే ప్రాజెక్ట్ దారి తప్పుతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పారితోషికం లెక్కలోనే ఒప్పందం చేసుకోవడంలో లాక్ అయినట్లు తేలింది. అయితే అన్ని నిర్మాణ సంస్థలు ఇలా ఒప్పందం చేసుకోవు. సంస్థ నిబంధనల ప్రకారం హీరో, డైరెక్టర్ల మధ్య ఆర్దిక ఒప్పందాలు జరుగుతుంటాయి.