హీరో లేకుండా హీరోపై యాక్ష‌న్ స‌న్నివేశాలు!

సూపర్ స్టార్ రజినీకాంత్ క‌థానాయ‌కుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైల‌ర్ 2` చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైన‌ట్లు తెలుస్తోంది.;

Update: 2025-03-03 16:30 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ క‌థానాయ‌కుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైల‌ర్ 2` చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ లేని స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. దీనిలో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జ‌రుగుతుంది. ఓ ప్రత్యేక సెట్ లో కొన్నికీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీ క‌రిస్తున్నారుట‌. వీటిని ర‌జ‌నీకాంత్ డూప్ పై షూట్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు కావ‌డంతో డూప్ తో టీమ్ రంగంలోకి దిగింది. భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ర‌జనీ కాంత్ వ‌య‌సు స‌హ‌క‌రించ‌దు. ఇప్ప‌టికే ఆయ‌న‌కు 70 ఏళ్లు పైబ‌డ్డాయి. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 74 ఏళ్లు. ఆన్ సెట్స్ లో ప‌లుమార్లు అస్వ‌స్త‌త‌కు గురైన సంద‌ర్భాలు ఉన్నాయి. ఓవ‌ర్ టైమ్ కూడా ప‌ని చేయ‌లేకపోతున్నారు. దీంతో `జైల‌ర్ 2` లో చాలా యాక్ష‌న్ స‌న్నివేశాల్ని డూప్ తోనే పూర్తి చేసే అవ‌కాశం ఉంది. పైగా ర‌జ‌నీకాంత్ ఇప్పుడు జైల‌ర్ టీమ్ కి అందుబాటులో కూడా లేరు.

ప్ర‌స్తుతం ఆయ‌న లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `కూలీ`లో న‌టిస్తున్నారు. ఈ సినిమా కూడా సెట్స్ లో ఉంది. ఆ సనిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొంత కాలంగా ఆషూట్ లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేసి జైల‌ర్ 2 లో జాయిన్ అవ్వాల‌ని ఆయనా ఎదురు చూస్తున్నారు. ఇది భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. ఈ సినిమా కోసం కూడా లోకేష్ యాక్ష‌న్ స‌న్నివేశాల్ని డూప్ పైనే చిత్రీక‌రించి న‌ట్లు వార్త‌లొచ్చాయి.

వ‌చ్చే నెల నుంచి ర‌జ‌నీకాంత్ `జైల‌ర్ 2` షూట్లో జాయిన్ అవుతార‌ని స‌మాచారం. ఈసినిమాలో తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో య‌ధావిధిగా కొన‌సాగుతున్నారు. `జైల‌ర్` లో ఈ పాత్ర‌లు హైలైట్ అయిన సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీ పాత్ర ఎంత బ‌ల‌మైన‌దో? సినిమాకు ఈపాత్ర‌ల‌కు కూడా అంతే పిల్ల‌ర్ గా ప‌నిచేసాయి.

Tags:    

Similar News