మెగాస్టార్ డాన్సుపై సాయి పల్లవి కామెంట్స్!
సాయి పల్లవిని అభిమానించనది ఎవరు? ఆమె నటనకు, డాన్సుకు ప్రేక్షకులు ఫిదా అవుతారు. న;
సాయి పల్లవిని అభిమానించనది ఎవరు? ఆమె నటనకు, డాన్సుకు ప్రేక్షకులు ఫిదా అవుతారు. నటిగా, డాన్సర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ డీసెంట్ పాత్రలతోనే ప్రేక్షకుల్ని అలరించడం అమ్మడి ప్రత్యేకత. తనలో ఆ రేర్ క్వాలిటీ కి కూడా ప్రత్యేకమైన అభిమానులున్నారు. ఇక ఇండస్ట్రీ నుంచి సాయి పల్లవికి అంతే ఫాలోయింగ్ ఉంది.
మెగాస్టార్ చిరంజీవి నుంచి తర్వాత హీరోల వరకూ అందరూ కూడా సాయి పల్లవి అంటే ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. అయితే ఓ సందర్భంలో చిరంజీవితో నటించే అవకాశం కూడా వచ్చింది సాయి పల్లవికి. కానీ సాయి పల్లవి ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించింది. అది చిరంజీవి చెల్లెలు పాత్ర కావడంతో వదులుకుంది. మెగాస్టార్ తో తాను కేవలం డాన్సర్ గా పోటీ పడే రోల్ చేస్తానని అప్పట్లో ఆఛాన్స్ వదులుకుంది.
మెగాస్టార్ అంటే సాయిపల్లవి ఎంతో అభిమానిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. ' నేను చిన్నప్పుడు చిరంజీవి నటించిన 'ముఠామేస్త్రీ' సినిమా ఎక్కువగా చూసేదాన్ని. అందులో చిరంజీవి గారికి డాన్సుకు ఫిదా అయ్యాను. ఆయన ప్రతీ సినిమాలో గొప్ప డాన్స్ చేస్తారు. 'ముఠా మేస్త్రీ' మాత్రం ప్రత్యేకం. ఆ డాన్స్ చూసే డాన్సర్ అవ్వాలనిపించింది.
అప్పటి నుంచి డాన్సు షోలలో పాల్గొనడం మొదలు పెట్టాను. ఒక ఈవెంట్ లో చిరంజీవి గారితో డాన్సు చేయడం అన్నది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన. ఆయన పక్కన డాన్స్ చేస్తుంటే ఏదో తెలియని ఎనర్జీ జనించేది' అని తెలిపింది. మొత్తానికి సాయి పల్లవి కూడా డాన్సుల్లో స్పూర్తి చిరంజీవి అని ఇన్నాళ్లకు బయట పడింది.