విజ‌య్ సినిమాను ప్రియాంక రిజెక్ట్ చేసింది: మ‌ధు చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.;

Update: 2025-03-04 02:45 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. బాలీవుడ్ లో కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రియాంక, సింగ‌ర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయి, హాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీలో ప్రియాంక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ మూవీలో ప్రియాంక చోప్రా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోస‌మ‌ని కొద్ది రోజుల కింద‌టే హైద‌రాబాద్‌కు వ‌చ్చింది ప్రియాంక‌.

ఇక అస‌లు విష‌యానికొస్తే ప్రియాంక త‌ల్లి మ‌ధు చోప్రా ప్రియాంక గురించి ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో మ‌ధు చోప్రా ప్రియాంక సినీ కెరీర్ గురించి మాట్లాడింది. విజ‌య్ కు జోడీగా త‌మిజాన్ సినిమాలో ముందుగా ప్రియాంక‌ను అడిగిన‌ప్పుడు ఆ సినిమాకు ప్రియాంక నో చెప్పింద‌ట‌.

కానీ త‌మిజాన్ చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్రియాంక తండ్రిని వ‌చ్చి అడిగార‌ని, తండ్రి మాట కాద‌న‌లేక‌, ఆయ‌న మీద అభిమానంతో ప్రియాంక ఆ సినిమాలో న‌టించిన‌ట్టు మ‌ధు చోప్రా తెలిపారు. ప్రియాంక నో చెప్పిన‌ప్ప‌టికీ త‌మిజాన్ మేక‌ర్స్ విన‌లేదని, కేవ‌లం రెండు నెల‌ల పాటూ స‌మ్మ‌ర్ హాలిడేస్ లో త‌మ సినిమా షూట్ కు టైమ్ ఇవ్వ‌మ‌ని అడిగార‌ని, తండ్రి మాట కాద‌న‌లేక ప్రియాంక చోప్రా ఒప్పుకున్న‌ట్టు ఆమె తెలిపారు.

విజ‌య్ అంటే ప్రియాంక‌కు ఎంతో గౌర‌వ‌ముంద‌ని, ఎంతో ఓపిక‌తో విజ‌య్ ప్రియాంక‌కు సెట్స్ లో హెల్ప్ చేసేవాడ‌ని, ప్ర‌భుదేవా బ్ర‌ద‌ర్ రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీలో స్టెప్స్ చాలా హార్డ్ గా ఉన్నాయ‌ని, విజ‌య్ ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్ అవ‌డంతో వాటిని ఈజీగా చేసేశాడ‌ని, కానీ ప్రియాంక ఆ డ్యాన్స్ చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టు మ‌ధు చోప్రా తెలిపారు. డ్యాన్స్, భాష‌, డైలాగ్స్ చెప్పే విష‌యంలో కూడా విజ‌య్, ప్రియాంక‌కు ఎంతో హెల్ప్ చేశాడ‌ని ఆమె వెల్ల‌డించారు.

Tags:    

Similar News