విక్టరీతో పూరి ఎందుకు సెట్ అవ్వడం లేదు!
అయితే దగ్గుబాటి కాంపౌండ్ లో రానాతో మాత్రం పూరి ' నేను నా రాక్షసి' అనే సినిమా చేసాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. మరి ఇప్పటికైనా పూరి వెంకటేష్ తో ప్లాన్ చేస్తారా? అన్నది చూడాలి.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసారు. సీనియర్ హీరోలు..ఆ తర్వాత జనరేషన్ హీరోలతోనూ కలిసి పనిచేసారు. బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, రవితేజ, గోపీచంద్, మహేష్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రానా, వరుణ్ తేజ్, రామ్ ఇలా చాలా మంది హీరోలతో సినిమాలు చేసారు. కానీ మిస్సైన సీనియర్ హీరోలు ఎవరైనా ఉన్నారా? అంటే ఇద్దరు కనిస్తారు. వాళ్లే మెగాస్టార్ చిరంజీవి...విక్టరీ వెకంటేష్.
చిరంజీవితో సినిమా పూరికి పెద్ద విషయం కాదు. చాలా కాలంగా ఆ కాంబినేషన్ లో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. స్టోరీ కుదరడం లేదు. కుదిరిన రోజు పట్టాలెక్కిపోతుంది. అది ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. పూరి-చిరు మధ్య మంచి స్నేహం కూడా ఉంది. చిరంజీవి తో సినిమా తీయాలని పూరి కూడా అంతే కసి పట్టుదలతో పని చేస్తున్నారు. కానీ వెంకటేష్ విషయంలో మాత్రం ఈ కాంబో గురించి ఇంత వరకూ ఎక్కడా చిన్న వార్త కూడా రాలేదు.
పూరి హీరోల జాబితాలో చాలా పేర్లు కనిపిస్తున్నాయి. కానీ వెంకీ పేరు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇంత వరకూ ఈ కాంబినేషన్ గురించి ఎక్కడా ప్రచారంలోకి వచ్చింది కూడా లేదు. అయితే దగ్గుబాటి కాంపౌండ్ లో రానాతో మాత్రం పూరి ' నేను నా రాక్షసి' అనే సినిమా చేసాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. మరి ఇప్పటికైనా పూరి వెంకటేష్ తో ప్లాన్ చేస్తారా? అన్నది చూడాలి. వెంకటేష్ కూడా డైరెక్టర్లను రిపీట్ చేసి పని చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో పూరి ఛాన్స్ తీసుకుంటే? బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఆయనతో ఓ సినిమా చేస్తే సీనియర్ హీరోలందర్నీ పూరి కవర్ చేసినట్లు అవుతుంది. మరి 2025లో అలాంటి అవకాశం ఉంటుందా? అన్నది చూడాలి. అయితే మ్యాచో స్టార్ గోపీచంద్ తో మరోసారి సినిమా చేయడానికి పూరి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.