SSMB29: జక్కన్నకు చిక్కకుండా లీక్ చేశాడా?

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న SSMB29 సినిమా ఎనౌన్స్ చేసి చాలా కాలం అయినప్పటికీ షూటింగ్ విషయంలో సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.;

Update: 2025-03-04 03:58 GMT

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న SSMB29 సినిమా ఎనౌన్స్ చేసి చాలా కాలం అయినప్పటికీ షూటింగ్ విషయంలో సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. మహేశ్ బాబు ప్రధాన పాత్రలో ఆయన రూపొందిస్తున్న ఈ సినిమాపై అఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా ఏదో ఒక రకంగా లీక్స్ అయితే వస్తున్నాయి. ప్రతి లీక్ కూడా భారీ చర్చలకు దారితీస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.


అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎవరు కూడా ఓపెన్‌గా స్పందించలేదు. కానీ తాజాగా పృథ్వీరాజ్ సోషల్ మీడియా పోస్టుతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

పృథ్వీరాజ్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఇందులో తన ప్రస్తుత షెడ్యూల్‌ గురించి చెబుతూ ‘నా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను పూర్తి చేసి ప్రమోషన్లు ముగించాలి, కొత్త సినిమా కోసం గెటప్‌ మార్చుకోవాలి, నా మాతృభాష కాని భాషలో లాంగ్ మోనోలాగ్స్ ఉండే పాత్ర కోసం ప్రిపేర్ అవ్వాలి..’ అంటూ రాసుకొచ్చాడు. ముఖ్యంగా మాతృభాష కాని భాషలో అని చెప్పడంతో ఇది ‘SSMB29’ గురించే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ పోస్టుపై అతని భార్య సుప్రియా మీనన్ కూడా సరదాగా కామెంట్ చేస్తూ, ‘నీవు భర్తవని, మీకు బిడ్డ ఉందని గుర్తు చేసుకో!’ అని రాశారు. దీంతో, సోషల్ మీడియాలో ఈ వార్త మరింత వైరల్ అయింది. నిజానికి పృథ్వీరాజ్ ప్రస్తుతం మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘L2: ఎంపురాన్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా ‘నోబడీ’, ‘సంతోష్ ట్రోఫీ’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

అయితే, రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తాడా? అన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ అడ్వెంచర్ మూవీ పాన్ వరల్డ్ స్థాయిలో 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనుండటంతో, ప్రముఖ నటీనటులు ఇందులో భాగం కావడం సహజమే. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ జక్కన్న మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.

ఇక పృథ్వీరాజ్ జక్కన్నకు చిక్కకుండా ఒక ఇన్ డైరెక్ట్ గా లీక్ ఇచ్చినట్లు కామెంట్స్ వస్తున్నాయి. SSMB29 సినిమాను KL నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇది అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోందని టాక్. మహేష్ బాబు కెరీర్‌లో ఇది లార్జెస్ట్ ప్రాజెక్ట్ కానుండటంతో, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా, రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో తీర్చిదిద్దుతున్నట్లు కూడా తెలుస్తోంది.

Tags:    

Similar News