ఎన్నికల వేళ కావడంతో రాజకీయం ప్రస్తావన, ఓటు ప్రస్తావన తప్పడం లేదు ఎవరికీ. ఆఖరికి సినీ సెలబ్రిటీల ఇంటర్వ్యూల్లో కూడా ఈ అంశమే చర్చనీయాంశం అవుతూ ఉంది. రాజకీయంగా యాక్టివ్ గా ఉండే నటీమణులు అయినా, రాజకీయాలతో సంబంధం లేదని వారు అయినా ఎన్నికల గురించి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో నటి అలియా భట్ కూడా రాజకీయం విషయంలో స్పందించింది.
ఈ మధ్య కాలంలో అలియా పలు సామాజిక అంశాలతో కూడిన సినిమాల్లో నటించింది. ఉడ్తా పంజాబ్, రాజీ వంటి సినిమాలు ఆ కోవకే వస్తాయి. ఇక అలియా తండ్రి మహేశ్ భట్ కూడా రకరకాల సామాజిక అంశాల మీద స్పందిస్తూ ఉంటారు. దీంతో అలియా వద్ద ఎన్నికల అంశం గురించి ప్రస్తావన వచ్చింది.
అందరూ ఓటు వేయాలని చెప్పిన అలియా.. తను మాత్రం ఓటు వేయలేనంటూ వ్యాఖ్యానించింది. అందుకు కారణం ఏమిటంటే.. అలియాకు ఇండియన్ సిటిజన్ షిప్ లేకపోవడమే!
అలియాకు పుట్టుకతోనే భారత పౌరసత్వం లేదట. ఈ విషయాన్ని తనే చెప్పింది. తనకు బ్రిటీష్ పౌరసత్వం ఉందని, తన పాస్ పోర్ట్ కూడా బ్రిటన్ దే అని, తనకు ఇండియన్ పాస్ పోర్టు లేదని అలియా స్పష్టం చేసింది. అందుకే తను ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశమే లేదని వివరించింది! ఈ విషయం తనకూ బాధను కలిగించే అంశమే అని చెప్పుకొచ్చింది.