మ‌రో నాలుగు రోజులు బాల‌య్య‌ హిమాల‌యాల్లోనే!

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీను దర్శ‌క‌త్వంలో `అఖండ‌-2` షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-03-17 17:59 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీను దర్శ‌క‌త్వంలో `అఖండ‌-2` షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్తి చేసారు. హైద‌రాబాద్ లో కొన్ని స‌న్నివే శాలు...కుంభ‌మేళా లో మ‌రికొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం షూటింగ్ హ‌మాలయాల్లో జ‌రుగుతోంది. కొన్ని రోజులుగా అక్క‌డే నిర‌వ‌ధికంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు.

షూటింగ్ లో కొన్ని ర‌కాల అవాంత‌రాలు ఎదురైనా? ఎక్క‌డా వెన‌క్కి తగ్గ‌కుండా టీమ్ ప‌నిచేస్తోంది. ఇక్క‌డ బాల‌య్య స‌హా ప్ర‌ధాన తార‌గ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ప్ర‌త్యేకంగా ఇక్క‌డ చిత్రీక‌రించే డివోషిన‌ల్ సీన్స్ హైలైట్ అవుతాయ‌ని టీమ్ భావిస్తోంది. హిమాల‌యాల్లోనే మ‌రో నాలుగు రోజులు షూటింగ్ చేయాల్సి ఉందిట‌. దీంతో హిమాల‌యాల పార్ట్ మొత్తం పూర్త‌వుతుంద‌ని తెలుస్తోంది.

త‌దుప‌రి షెడ్యూల్ క‌ర్నూల్ లో మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. హిమాల‌యాల నుంచి తిరిగి రాగానే బాల‌య్య కొన్ని రోజులు విరామం తీసుకుని క‌ర్నూల్ షెడ్యూల్ లో జాయిన్ కానున్నారని స‌మాచారం. `అఖండ‌-2` పై ఎలాంటి అంచ‌నాలున్నాయ‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌రుస‌గా విజ‌యాలు ఆయ‌న మార్కెట్ ని పెంచాయి. `అఖండ` త‌ర్వాత బాల‌య్య‌కు వైఫ‌ల్యం లేదు.

ఈ నేప‌థ్యంలో `అఖండ‌-2` తో బాల‌య్య పాన్ ఇండియాలో సంచ‌ల‌నం న‌మోదు చేస్తార‌ని అంచ‌నా లున్నాయి. ఇంత వ‌ర‌కూ బాల‌య్య 300 కోట్ల క్ల‌బ్ లో చేర‌లేదు. `అఖండ` తాడ‌వం ఆ వ‌రుస‌లో నిల‌బెడు తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

Tags:    

Similar News