ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది
డెవిల్ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి.;
డెవిల్ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయశాంతి పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. అశోక క్రియేషన్స్ బ్యానర్లో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించారు.
రీసెంట్ గా ఈ చిత్ర టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కర్తవ్యం సినిమాలో విజయశాంతి చేసిన వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ కథను డెవలప్ చేసినట్టు కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఎంతో ప్రేమగా ఉండే అమ్మాకొడుకులు ఎందుకు దూరమయ్యారు? ఎందుకు వారిద్దరూ వేరు వేరు మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చింది? మళ్లీ వారిద్దరూ ఎలా కలుసుకున్నారనే నేపథ్యంలో సినిమా తెరకెక్కింది.
గతంలో తండ్రీ కొడుకుల మధ్య వార్, సెంటిమెంట్ కథాంశంతో పటాస్ చేసి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు తల్లీకొడుకుల కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ కమ్ ఎమోషనల్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో బబ్లూ పృథ్వీ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీలో పృథ్వీ పోలీస్ అధికారిగా అలరించనున్నారు.
తాజాగా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పృథ్వీ కూడా పాల్గొని తన కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. గత 50 సంవత్సరాలుగా తాను ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పిన పృథ్వీ సినిమాల్లో ఎన్నో ఎత్తు పల్లాలను చూశానని, కానీ ఇప్పుడు తన టైమ్ మారిందన్నారు. సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాలో ఛాన్స్ ఇచ్చి తన జీవితాన్ని మార్చేశారన్నారు.
ఇప్పటి వరకు తన కెరీర్లో 250 నుంచి 300 వరకు సినిమాలు చేశానని, అందులో ఎన్నో పాత్రలు పోషించానని, వాటన్నింటిలో తాను చేసిన అత్యంత కష్టమైన పాత్ర ఈ సినిమాలోనే చేసినట్టు పృథ్వీ తెలిపారు. సినిమాలో అంత గొప్పగా పృథ్వీ క్యారెక్టర్ లో ఏముంటుందో చూడాలి. కాగా ఈ టీజర్ కు కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఇచ్చిన బీజీఎం అన్నింటికంటే హైలైట్ గా నిలిచింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ తెలిపారు.