ఉప్పెన శేషారాయణంతో మంగపతి పోలిక.. సబబేనా..?
నటుడిగా ఎన్ని సినిమాలు చేసినా తమని సంతృప్తి పరిచే పాత్ర దొరికినప్పుడే ఆ యాక్టర్ కి కడుపు నిండుతుంది.;
నటుడిగా ఎన్ని సినిమాలు చేసినా తమని సంతృప్తి పరిచే పాత్ర దొరికినప్పుడే ఆ యాక్టర్ కి కడుపు నిండుతుంది. అందులోనూ తను చేసిన పాత్ర గురించి అందరు మాట్లాడుకుంటుంటే ఇది కదా అసలైన విజయం అనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి ఫీలింగ్ నె ఎక్స్ పీరియన్స్ చేస్తున్నారు ఒకప్పటి హీరో శివాజి. పాతికేళ్లుగా సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఆయన రీసెంట్ గా కోర్ట్ సినిమాలో ఒక పవర్ ఫుల్ రోల్ లో అదరగొట్టారు.
ముందు సైడ్ రోల్స్ చేసి ఆ తర్వాత హీరోగా ప్రమోట్ అయ్యి.. ఆ తర్వాత మళ్లీ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు శివాజి. ఐతే ఇన్నేళ్ల కెరీర్ లో శివాజి సూపర్ అనిపించుకున్న సందర్భాలు చాలా తక్కువ. ముఖ్యంగా కోర్ట్ లాంటి సినిమాలో శివాజిని చూసి సూపర్ అనేస్తున్నారంటే అది అతని అద్భుతమ నటనకు వచ్చిన స్పందనే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ని.. తెచ్చిన పేరుని శివాజి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
అందుకే రీసెంట్ గా జరిగిన కోర్ట్ సక్సెస్ మీట్ లో స్టేజ్ మీద కింద కూర్చుని మరీ తన అనుభూతిని తెలియచేశారు. ఐతే కోర్ట్ సినిమా చూసిన చాలామంది ఉప్పెన సినిమాలో శేస్షారాయణం పాత్రని గుర్తు చేసుకుంటున్నారు. ఉప్పెనలో ఆ పాత్రని విజయ్ సేతుపతి చేసి రక్తికట్టించారు. విజయ్ సేతుపతి చేస్తున్నాడు కాబట్టి బుచ్చి బాబు ఆ రోల్ అలా రాసుకున్నాడా.. లేదా అలా బుచ్చి బాబు రాశాడు కాబట్టి విజయ్ సేతుపతి అలా చేశాడా అన్నది తెలియదు కానీ ఇద్దరు కలిసి అదరగొట్టారు.
ఇక ఇప్పుడు కోర్ట్ సినిమాలో కూడా శివాజి తన రోల్ తో మరోసారి శేషారాయణాన్ని గుర్తు చేశాడు. ఐతే విజయ్ సేతుపతి ఇమేజ్ వేరు.. శివాజి ఇమేజ్ వేరు. సో కోర్ట్ చూసిన వారికి శివాజి లోని ఈ విలనిజాన్ని వాడుకునే ఛాన్స్ ఉందని ప్రూవ్ అయ్యింది. అందుకే కోర్ట్ తర్వాత కచ్చితంగా శివాజి డిమాండ్ పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో శివాజికి ఇన్నాళ్లకు ఒక మంచి బూస్టింగ్ ఇచ్చే పాత్ర దొరికినందుకు ఆయన్ని ఇష్టపడుతున్న వారు కూడా హ్యాపీ అంటున్నారు. నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ సినిమాపై ముందు నుంచి టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఐతే తెలుగు ఆడియన్స్ వారి నమ్మకాన్ని నిజం చేసి వారు కూడా బెస్ట్ అనిపించుకున్నారు.