మూడున్నరేళ్ల విరామం తరువాత ఎట్టకేలకు అల్లు శిరీష్ `ఊర్వశివో రాక్షశివో` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 20118లో వచ్చిన తమిళ చిత్రం `ప్యార్ ప్రేమ కాదల్`మూవీ ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. అను ఇమ్యాన్యుయేల్ హీరోయిన్ గా నటించగా అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగానే యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూ మంచి టాక్ ని సొంతం చేసుకుంది.
అయితే సినిమాలో మోతాదురు మించి ఇంటిమేట్ సీన్ లు, లెక్కకు మించి లిప్ లాక్ సీన్ లు వుండటం ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారాయి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారా.. రారా అన్నది పక్కన పెడితే టీమ్ ఎవరిని టార్గెట్ చేసి సినిమాని తెరకెక్కించారో ఆ యూత్ ని ఈ మూవీ ప్రస్తుతం ఊహించిన దానికి మించి ఎట్రాక్ట్ చేస్తూ వసూళ్లని రాబడుతోంది. సినిమా ఏ రేంజ్ హిట్ అన్నది ఈ సండే దాటితే గానీ చెప్పలేం. ఈ నేపథ్యంలో వచ్చిన టాక్ ని అలాగే కంటిన్యూ చేయాలనే ఆలోచనలో వుంది గీతా ఆర్ట్స్ కాంపౌండ్.
ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీని మరింత ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వెంటనే అలర్ట్ అయిన గీతా కాంపౌండ్ వెంటనే ఆదివారం సక్సెస్ సెలబ్రేషన్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందు కోసం ఏకంగా పాన్ ఇండియా స్టార్ పుష్పరాజ్ అల్లు అర్జున్ నే దించేస్తున్నారు. అల్లు శిరీష్ కెరీర్ లో `శ్రీరస్తు శుభమస్తు` తరువాత దక్కిన విజయం కావడంతో ఈ సినిమాని శిరీస్ కి పెద్ద హిట్టుగా మార్చాలనే ప్లాన్ లో వున్నారు.
ఇందులో భాగంగానే ఆదివారం సక్సెస్ సెలబ్రేషన్స్ తో జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించబోతున్నారు. ఇదే సందర్భంగా ప్రమోషన్స్ పరంగా మరింత వేగం పెంచబోతున్నారు. తమ్ముడు శిరీష్ అందుకున్న సక్సెస్ ని మరింతగా పెంచడం కోసం అన్నయ్య అర్జున్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి వచ్చేస్తుండటంతో సక్సెస్ సెలబ్రేషన్స్ కి మరింత ప్రత్యేకత ఏర్పడింది. బన్నీ తమ్ముడి సినిమాకు ఏ రేంజ్ లో బుస్టింగ్ ఇవ్వబోతున్నాడో తెలియాలంటే ఆదివారం బన్నీ స్పీచ్ వినేంత వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.