డీజే టీజర్ డేట్.. టైం.. ఇదిగో

Update: 2017-02-22 06:11 GMT
నాలుగు రోజుల కిందట రిలీజైన ‘దువ్వాడ జగన్నాథం’ ఫస్ట్ లుక్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న భారీ అంచనాలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి. మూడు నాలుగు రోజుల పాటు ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘డీజే’ ఫస్ట్ లుక్ గురించే చర్చ జరిగింది. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి.. మళ్లీ బన్నీ సందడి చేయబోతున్నాడు. దువ్వాడ జగన్నాథం టీజర్ లాంచ్ డేట్.. టైం కూడా ఫిక్సయిపోయాయి. మహాశివరాత్రి కానుకగా ఈ నెల 24న.. శుక్రవారం ఉదయం 9 గంటలకు డీజే టీజర్ లాంచ్ చేయనున్నట్లు దర్శకుడు చిత్ర బృందం ప్రకటించింది.

ఫస్ట్ లుక్ వచ్చిన వారం లోపే టీజర్ కూడా వచ్చేస్తుండటంతో బన్నీ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఫస్ట్ లుక్ తరహాలోనే టీజర్ కూడా అదిరిపోయే రేంజిలో ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. చాన్నాళ్ల కిందటే టీజర్ పనులు మొదలయ్యాయి. హరీష్ శంకర్-బన్నీ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే టీజర్ కూడా స్టైలిష్ గా ఉంటుందని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’లో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వేసవి కానుకగా మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఏప్రిల్లో ఆడియో విడుదల చేస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News