గోన గన్నారెడ్డి క్యారెక్టర్‌ రాయించిందెవరు?

Update: 2015-10-10 03:30 GMT
కష్టపడి గుణశేఖరుడు రుద్రమదేవి చరిత్రను సినిమాగా మలచటం ఏంటి.. చివరకు సినిమా రిలీజ్‌ అయ్యాక గోన గన్నారెడ్డి పాత్రకు ఫుల్‌ డిమాండ్‌ రావడమేంటి? మొత్తంగా క్రేజ్‌ తెచ్చుకోవడమే కాదు.. ఏకంగా బి. సి. సెంటర్లలో సినిమా కలెక్షన్లపై ప్రభావం కూడా చూపించేట్టున్నాడు ఈ గన్నారెడ్డి. అదేలేండి.. గోన గన్నారెడ్డి. నువ్‌ గమ్మునండవయ్యా.. అసలు ఈ క్యారెక్టర్‌ ఇంత పవర్ ఫుల్‌ గా చెక్కడం వెనుక ఏం మర్మం ఉందో మరి..

ఈ కథను, కథలోని క్యారక్టర్లన్నింటినీ కూడా పరుచూరి బ్రదర్స్‌ సహాయంతోనే చెక్కాడు గుణశేఖర్‌. తను అనుకున్న స్ర్కిప్టును వారి దగ్గరకు తీసుకెళ్లి.. దానికి సినిమాటిక్‌ ఎడాప్షన్‌ తీసుకొచ్చారట. బాగానే ఉంది. అయితే ఈ ఎడాప్షన్‌ లో ఒక పాయింట్‌ మాత్రం మిస్‌ అయిపోయారు. సినిమాలో రుద్రమదేవి పాత్రను హైలైట్‌ చేయకుండా.. మధ్యలో క్యామియో చేసిన గోన గన్నారెడ్డిని హైలైట్‌ చేసేశారు. ఇక్కడే ఒక రూమర్‌ వినిపిస్తోంది. నిజానికి మొత్తం కథను విని.. సినిమా తాలూకు విజువల్స్‌ చూసిన అల్లు అరవింద్‌.. కేవలం గుణశేఖర్‌ కు ఫండింగ్‌ చేయడమే కాదు.. నా కొడుక్కి క్యారెక్టర్‌ కావాలని అడిగినట్లు అప్పట్లో చాలా వార్తలొచ్చాయి. అదే సమయంలో ఈ క్యారెక్టర్‌ ను మరింత పవర్‌ ఫుల్‌ గా తీర్చిదిద్దాలని ఆయన కోరడంతో.. సినిమాకు ఈ క్యామియో ఉపయోగపడుతుందని.. తెలంగాణ యాసలో పంచ్‌ లు పేలే డైలాగులు చెక్కించారట.

ఆ పంచ్‌ లన్నీ ఏ రేంజులో వర్కవుట్‌ అయ్యాయ్‌ అంటే.. సినిమా చూసొచ్చిన 80% ఆడియన్సు అనుష్క కంటే ముందు అల్లు అర్జున్‌ పేరునే చెబుతున్నారు. దీని తస్సారవలా బడ్డూ.. ఇదేందయ్యా ఇడ్డూరం.. అసలు సినిమా అంతా నడిపించే రాణమ్మని వదిలేసి.. మొలతాడులో తాయత్తు అంటూ విజిల్సు కొట్టించిన బన్నీకి ఓట్లన్నీ పడిపోతున్నాయ్‌.. ఇది స్ర్కిప్టు పొరపాటేగా.. లేకపోతే బన్నీ టాలెంట్‌ అనేద్దమా?
Tags:    

Similar News