కొన్ని విషయాల మీద కోపం వచ్చేయటం సినీ ప్రముఖులకు ఒక అలవాటుగా మారింది. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. తన సినిమాకు సంబంధించినంత వరకూ వారు చాలా పరిమితంగా ఆలోచిస్తారన్న విషయాన్ని మరోసారి అందరికి తెలిసేలా చేశారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన అల్లు అర్జున్.. సినిమా రివ్యూల మీద.. రివ్యూలు రాసే వాళ్ల మీద తనకున్న ఆగ్రహాన్ని తనదైన శైలిలో బయటపెట్టారు.
సినిమా రివ్యూలు రాసేవాళ్లకు సినిమా గురించి తెలీదేమోఅనిపిస్తుందని తన మనసులోని మాటను చెప్పేశారు అల్లుఅర్జున్. ‘‘రాసే వాళ్లంతా బాగా చదువుకున్నవాళ్లే కావొచ్చు. వాల్ల స్థాయిలోనే ఆలోచిస్తున్నారు. 4జీ.. వాట్సాప్ అంటూ ఎక్కడో ఉండిపోయారు.
వాళ్లకు సీ క్లాస్ ఆడియన్స్ పల్స్ ఎలా తెలుస్తుంది? సినిమాని సినిమాలా చూసి సమీక్షించేవాళ్లు ఇక్కడ కనిపించటం లేదు’’ అంటూ తన కోపాన్ని వెళ్లగక్కేశాడు బన్నీ. ఉన్నట్లుండి బన్నీకి రివ్యూల మీదా.. రివ్యూలు రాసేవాళ్ల మీద అంత ఆగ్రహం ఎందుకు వచ్చినట్టు..?