అదే మ్యాజిక్ అంటున్న అల్లు అర్జున్!

Update: 2018-11-27 06:59 GMT
కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేస్తాయి. సాధారణ ప్రేక్షకుల విషయంలోనే కాదు స్టార్స్ విషయంలో కూడా అలానే జరుగుతుంది.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్య అలాంటి విషయాన్నే తన అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నాడు.  ఇంతకీ బన్నీ దేని గురించి చెప్పాడంటే 1995 లో రిలీజ్ అయిన ఒక సినిమాలోని పాట గురించి.

షారూఖ్ ఖాన్ - కాజోల్ జంటగా నటించిన లవ్ స్టొరీ 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' అప్పట్లో బ్లాక్ బస్టర్ లకే బ్లాక్ బస్టర్.  ఆ సినిమాలో పాటలన్నీ చార్ట్ బస్టర్లే గానీ 'తుఝే దేఖాతో ఏ జానా సనమ్' పాట అప్పట్లో దేశవ్యాప్తంగా యువతరాన్ని ఒక ఊపు ఊపింది.  దాని గురించే ఇన్ స్టాగ్రామ్ లో ఇలా పోస్ట్ పెట్టాడు.. "తుఝే దేఖాతో ఏ జానా సనమ్.. నేను 1995లో  ఆ పాటను చూసినప్పుడు అదో అద్భుతంలా గా అనిపించింది.. మళ్ళీ 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తే .. నా హృదయంలో అదే మ్యాజిక్.. దానికిపై అదే రకమైన ప్రేమ.  నా లైఫ్ లో ఇదో బెస్ట్ సినిమాటిక్ మూమెంట్.. ఇప్పుడు.. ఎప్పటికీ."

అల్లు అర్జున్ చెప్పిన విషయంలో అతిశయోక్తి ఏమీ లేదు. లవ్ స్టొరీలకు కొత్త ఒక ఫార్మాట్ పరిచయం చేసిన ఆ సినిమా ఎప్పటికీ క్లాసిక్.  షారూఖ్- కాజల్ కెమిస్ట్రీ.. హృదయాన్ని టచ్ చేసే మ్యూజిక్.. ఎప్పటికీ సినిమా లవర్స్ ను అలరిస్తూనే ఉంటాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ తన కొత్త సినిమా సంగతి మాత్రం మాట్లాడడం లేదే గురుడు!

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News